• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MINSTER AVAINTHI MP VIJAYASAI REDDY BULLET RIDING IN GVMC ELECTION CAMPAIGN NGS

Municipal elections: గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో బుల్లెట్ బాబులు: కేసులు పెట్టాలంటున్న విపక్షాలు

Municipal elections: గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో బుల్లెట్ బాబులు: కేసులు పెట్టాలంటున్న విపక్షాలు

విశాఖ మేయర్ పీఠంపై ఫోకస్ చేసింది అధికార వైసీపీ. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రచారాన్ని అంతా తన భుజాలపై వేసుకున్నారు. ఇలా వార్డు వార్డులో బుల్లెట్ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా మంత్రి అవంతి, విజయసాయిరెడ్డి బైక్ నడపడంపై విపక్షాలు తప్పు పడుతున్నాయి.

విశాఖ మేయర్ పీఠంపై ఫోకస్ చేసింది అధికార వైసీపీ. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రచారాన్ని అంతా తన భుజాలపై వేసుకున్నారు. ఇలా వార్డు వార్డులో బుల్లెట్ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా మంత్రి అవంతి, విజయసాయిరెడ్డి బైక్ నడపడంపై విపక్షాలు తప్పు పడుతున్నాయి.

  • Share this:
    విశాఖ గ్రేటర్ పీఠంపై ఫోకస్ చేసింది వైసీపీ. తొలిసారి పోటీకి దిగుతున్న అధికార పార్టీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఓవైపు ఆపరేషన్ ఆకర్ష్ అంటూనే.. విపక్షాలకు అందని రీతిలో దూకుడుగా ప్రచారం చేస్తోంది. ఓ వైపు అభ్యర్థుల జాబితాలను ఖరారు చేస్తూనే.. మరోవైపు ఆయా అభ్యర్థుల తరపున ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా విశాఖలో బాధ్యతలను ఎంపీ విజయసాయిరెడ్డి తన భుజాలపైనే వేసుకున్నారు.

    విశాఖను పరిపాలన రాజధాని చేస్తున్నామన్నదే ప్రధాన అస్త్రంగా బరిలోకి వెళ్తోంది. పరిపాలన రాజధానిని టీడీపీ అడ్డుకుంటుందనే వాదనను ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ ఉద్యమ సెగ తగిలే ప్రమాదం ఉండడంతో.. ముందుగానే విజయసాయి రెడ్డి అలర్ట్ అయ్యారు. ఆ తప్పు కేంద్రానిదే అంటున్నారు.. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలోనే ఆయన పాదయాత్ర చేశారని విపక్షాలు ఆరోపించాయి కూడా.. విపక్షాలు విమర్శలు ఎలా ఉన్నా.. వార్డుల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు విజయసాయిరెడ్డి..

    విశాఖ నగరంలో ఉన్న అన్ని నియోజకవర్గంలోని వార్డు వార్డుకూ తిరిగి ప్రచారం చేస్తున్నారు. గత మూడు రోజుల నుంచి కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టు విజయసాయి రెడ్డి విరామం లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా 40వ వార్డు అభ్యర్థి గుండపు నాగేశ్వర రావు, 63వ వార్డు అభ్యర్థి పిలకా రామ్మోహన్ రెడ్డిల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బైక్ ర్యాలీలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు.

    ఒక బైక్‌పై రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు, మరో బైక్‌పై విజయసాయి ఉన్నారు. అది కూడా బుల్లెట్ బైక్ పై స్టైలిష్ గా నడిపారు. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. జై జగన్, జై విజయసాయి రెడ్డి, జై అవంతి అనే నినాదాలతో ర్యాలీ అంతా మారుమోగింది. అయితే ఇద్దరు నేతలు బైక్ లు నడపడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

    ఇద్దరూ హెల్మెట్ లేకుండా ర్యాలీలో పాల్గొన్నారు. మాస్క్ లు కూడా పెట్టుకోలేదు. కోవిడ్ నిబంధనలను గాలికొదిలేశారు. బాధ్యతగల పదవుల్లో ఉండి... హెల్మెట్ ధరించకుండా బుల్లెట్ నడపటంతో పాటు కోవిడ్ నిబంధనలు అతిక్రమించడంతో ఇరువురు నేతల తీరును విపక్ష నేతలు తప్పు పడుతున్నారు. ఏపీలో ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఒక పక్క ప్రభుత్వమే భారీ జరిమానాలు విధిస్తుంటే... మరోపక్క ఆ ప్రభుత్వంలోని వారే నిబంధనలు గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏపీలో హెల్మెట్ లేని ప్రయాణానికి రూ.1000 జరిమానా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏపీలో భారీ జరిమాన్లపై ఇప్పటికే సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పుడు ఇలా హెల్మెంట్ లేకుండా ఇద్దరు నేతలు బైక్ నడపడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: