tirupati by poll: వందమంది వకీల్ సాబ్ లు వచ్చినా.. సీఎం సాబ్ సింగిల్ గానే వస్తారు?

వకీల్ సాబ్ vs ఏపీ ప్రభుత్వం

ఒక్కొక్కరినీ కాదు షేర్ ఖాన్ వందమందిని ఒకే సారి రమ్మను అన్న రేంజ్ లో డైలాగ్ లు పేలుస్తున్నారు.. సింహం సింగిల్ గానే వస్తుంది అంటూ ప్రత్యర్థులపై పంచ్ లు వేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు సమయం దగ్గర పడడంతో వైసీపీ నేతలు విమర్శల దాటిని పెంచారు.

 • Share this:
  తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. విమర్శలు, ప్రతి విమర్శలకు తోడు సవాళ్ల పర్వం కొనసాగుతోంది. వైఎస్ వివేకానంద హత్యతో జగన్ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని తిరుపతి వెంకన్న స్వామిపై ప్రమాణం చేయగలరా అంటూ మొదట లోకేష్ సవాల్ విసిరారు. దీంతో వైసీపీ నేతలు మరో సవాల్ విసిరారు టీడీపీకి. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ఓడిపోతే 21 మంది ఎంపీలు రాజీనామా చేస్తామని.. ఒకవేళ టీడీపీ ఓడిపోతే.. ఆ పార్టీ ఎంపీలతో పాటు రఘురామ రాజు కూడా ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు పెద్ది రెడ్డి. దీనిపై టీడీపీ నేతలు కూడా స్పందించారు. తిరుపతి ఉప ఎన్నిక ఒకటే కాదని.. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని.. ఆ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీని మూసేస్తామంటూ అచ్చం నాయుడు సరికొత్త సవాల్ విసిరారు. మరోవైపు ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా మరో సవాల్ విసిరారు. తిరుపతి ఉప ఎన్నిక ఒక్కటే కాదని.. ఏపీకి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలకు వ్యతిరేకంగా అందరు ఎంపీలం రాజీనామా చేద్దామని దమ్ముంటే రండి అంటూ సవాల్ విసిరారు. ఇలా అధికార, విపక్షాల మధ్య సవాళ్ల పర్వం పీక్ లెవల్ కు వెళ్లింది.

  తాజాగా మంత్రి అనిల్ కుమార్ సైతం సంచలన సవాల్ విసిరారు టీడీపీకి. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓడిపోతే తమ పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు వెంటనే రాజీనామా చేస్తామని.. ఆ సవాల్ కు టీడీపీ ఎంపీలు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తిరుపతి ఎన్నికను తమ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి రెఫరెండంగా భావిస్తూ ప్రజల్లోకి వస్తోంది అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన రాజీనామాల సవాల్‌ని స్వీకరీంచే దమ్ము టీడీపీ నేతలకు ఉందా అంటూ సవాల్ చేశారు. 24 గంటలు దాటినా ఇప్పటి వరకు ఒక్కరు కూడా స్పందించలేదు అంటూ.. టీడీపీ ఓడిపోతుందని వారికి ముందే తెలుసు అంటూ విమర్శించారు.

  ఏపీ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో సీఎం జగన్ తిరుపతి సభను వాయిదా వేసుకుంటే.. టీడీపీ నేతలు పెడర్ధాలు చెప్పడం దారుణమంటూ మండిపడ్డారు. అయితే వకీల్ సాబ్ సినిమా టిక్కెట్ల ధరతో చంద్రబాబుకు ఏం పని అని మండిపడ్డారు. రాజకీయాల కోసం పవన్ ను వెనుకేసుకొస్తూ విమర్శలు చేస్తున్న చంద్రబాబుకు ప్రజల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. వకిల్ సాబ్ సినిమా టిక్కెట్లను పెంచి అభిమానులను, ప్రజలను దోచుకోవాలా అంటూ మండిపడ్డారు. వకిల్ సాబ్‌ను వెనుక వేసుకొని చంద్రబాబు నానా అవస్థలు పడుతున్నాడరని సెటైర్లు వేశారు. అసలు చంద్రబాబుది ఏ పార్టీ అని? ఆయన ఎవరికి సమర్ధిస్తున్నారో ఆయనకైనా అర్థమైందా అని నిలదీశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో 20 శాతం స్థానిక సంస్థల్లో కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు.

  టీడీపీ కీలక నేతలందరికీ సొంత నియోజకవర్గాల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. చంద్రబాబుకు కుప్పంలో.. నారా లోకేష్ కు మంగళగిరిలో ప్రజలు తీవ్రంగా తిరస్కరించినా.. బుద్ధి మారలేదని మండిపడ్డారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయో, టీడీపీకి ఉన్నాయో ఈ ఉప ఎన్నిక తరువాత తేలిపోతుందన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి వంద మంది వకీల్ సాబ్ లు వచ్చినా.. మా సీఎం సాబ్ సింగిల్ గా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని.. ఎవరూ సీఎంతో పోటీ పడలేరంటూ అనిల్ కుమార్ పంచ్ డైలాగ్ లు వేశారు.
  Published by:Nagesh Paina
  First published: