టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అనారోగ్యం... పరామర్శించిన కేటీఆర్, హరీశ్ రావు
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆందోల్ ఎమ్మెల్యే కాంత్రి కిరణ్‌ను మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు పరామర్శించారు.
news18-telugu
Updated: November 5, 2019, 7:54 PM IST

క్రాంతి కిరణ్‌ను పరామర్శించిన కేటీఆర్
- News18 Telugu
- Last Updated: November 5, 2019, 7:54 PM IST
అనారోగ్యంతో బాధపడుతున్న ఆందోల్ ఎమ్మెల్యే కాంత్రి కిరణ్‌ను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పార్టీ ముఖ్యనేతలు పరామర్శించారు. పది రోజుల క్రితం గుండె సంబంధింత ఇబ్బంది తలెత్తడంతో... హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్సలో భాగంగా క్రాంతి కిరణ్‌కు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. నిన్న ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తన సోదరుడి ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు, పలువురు జర్నలిస్టు సంఘాలు నాయకులు ఆయనను పరామర్శించారు.

