ఒకే కారులో తెలంగాణ మంత్రులు... రూమర్స్‌కు చెక్

తమ మధ్య అలాంటి పొలిటికల్ గ్యాప్ ఏమీ లేదని మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

news18-telugu
Updated: May 20, 2020, 7:00 PM IST
ఒకే కారులో తెలంగాణ మంత్రులు... రూమర్స్‌కు చెక్
ఒకే కారులో మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్
  • Share this:
రాజకీయాల్లో నేతల మధ్య విభేదాలు సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు ఇద్దరు నేతల మధ్య పెరిగిన గ్యాప్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ మధ్య కూడా ఇదే రకమైన పొలిటికల్ గ్యాప్ ఉందని చాలాకాలం నుంచి ప్రచారం సాగుతోంది. ఈటలకు చెక్ చెప్పేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన బీసీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను తెలంగాణ కేబినెట్‌లోకి తీసుకున్నారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే తమ మధ్య అలాంటి పొలిటికల్ గ్యాప్ ఏమీ లేదని మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

ఇద్దరు మంత్రులు కలిసి ఒకే కారులో ప్రయాణించారు. అదే కారులో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒదితల సతీశ్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా ఉన్నారు. అలా ఒక్క కారులో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు కూర్చుని ప్రయాణం చేశారు. కలెక్టరేట్ల సమీక్షా సమావేశం వరకూ మంత్రి గంగుల కమలాకరే కారు నడిపారు. కారు ప్రయాణంలో ఎమ్మెల్యేలు, మంత్రులు జోక్స్ వేసుకున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: May 20, 2020, 6:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading