• Home
 • »
 • News
 • »
 • politics
 • »
 • MINISTER VEMULA PRASHANTH REDDY FIRES ON MP DHARMAPURI ARAVIND SU

Vemula Prashanth Reddy: కోడి గుడ్డుపై ఈకలు పీకడం కాదు.. ఎంపీ అరవింద్‌పై మంత్రి వేముల ఫైర్..

మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాలు చూసి ఓర్వ‌లేక ఎంపీ ఆర్వింద్ నోరుపారేసుకుంటున్నార‌ని మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.

 • Share this:
  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాలు చూసి ఓర్వ‌లేక ఎంపీ ఆర్వింద్ నోరుపారేసుకుంటున్నార‌ని మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఎంపీ అరవింద్ కొడి గుడ్డ‌పై ఈక‌లు పీకిన‌ట్టు ప్ర‌తి విష‌యంపై అనవసర రాద్దంతం చేస్తున్నారని అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ది ప‌నుల‌కు మంత్రి ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాప‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నిక‌ల్లో ప‌సుపు బోర్డు తీసుకోస్తాన‌ని అరవింద్ బాండ్ పేప‌ర్‌పై రాసి ఇచ్చారని.. ఇప్పుడు పార్ల‌మెంట్‌లో వాళ్ల మంత్రులే ప‌సుపు బోర్డు ఇవ్వం అని చెప్పారని ఎద్దేవా చేశారు. దీంతో ప‌ది రోజులుగా ఎంపీ అరవింద్ క‌నిపించాకుండా పోయాడని వ్యాఖ్యానించాడు. ప‌సుపు బోర్డు గురించి మాట్లాడే స‌త్తాలేక.. మాద‌వన‌గ‌ర్ రైల్వే బ్రిడ్జీ కొసం ధ‌ర్నా చేస్తా అన‌డం సిగ్గుచేటు అన్నారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌నుకుంటే కేంద్ర నుంచి నిదులు తీసుకు రావాల‌ని అన్నారు.

  పుష్కరఘాట్‌ వద్ద జరిగిన ఘటన బాధ కలిగించింది.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి
  నిజామాబాద్ జిల్లా మెండోరా మండ‌లంలోని శ్రీరామ్‌సాగర్ పుష్కర ఘాట్‌ను శనివారం మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. పుష్కర ఘాట్ వ‌ద్ద‌ నిన్న జరిగిన దుర్ఘటన చాలా బాధ కలిగించిందని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు. పుష్కర ఘాట్ కు ప్రతి శుక్రవారం దాదాపు ఐదువేల మంది వచ్చి గంగా స్థానం చేస్తారని.. ప్ర‌మాదానికి గల కార‌ణాల‌ను పరిశీలించి,ఇటువంటి దుర్ఘటనాలు జ‌రుగ‌కుండా అరిక‌ట్టాడానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.


  ప్రతి శుక్రవారం ఘాట్ వద్ద ఒక వీఆర్ఏ, గజ ఈతగాడిని ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పక్షాన జాగ్రత్తలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని.. మీరు మీ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు.
  Published by:Sumanth Kanukula
  First published: