వైసీపీ రెబల్ ఎంపీకి ఏపీ మంత్రి వార్నింగ్.. దమ్ముంటే అలా చేయాలని సవాల్

రఘురామకృష్ణంరాజు (File)

Raghuramakrishnam Raju News: రఘురామకృష్ణంరాజుకు దమ్ముంటే తన నియోజకవర్గానికి వచ్చి వినాయక చవితి పూజలు చేయాలని సవాల్ విసిరారు

 • Share this:
  Raghuramakrishnam Raju: కొద్దిరోజుల నుంచి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆయనకు దమ్ముంటే తన నియోజకవర్గానికి వచ్చి వినాయక చవితి పూజలు చేయాలని సవాల్ విసిరారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడవద్దని ఎంపీ రఘురామకృష్ణంరాజును హెచ్చరించారు. ఆయన చంద్రబాబు మార్గదర్శకాలతో పని చేస్తున్న పనికిమాలిన రాజకీయ నాయకుడని విమర్శించారు. ఆయన నీచంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. హైద్రాబాద్‌లో చంద్రబాబు, ఢిల్లీలో కూర్చొని రఘురామకృష్ణంరాజు హిందూ మతంపై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు.

  Three capitals issue, ap three capitals issue news, minister vellampalli Srinivas news, minister vellampalli Srinivas comments on ysrcp manifesto, ysrcp manifesto news, ap news, cm ys jagan mohan reddy, మూడు రాజధానుల అంశం, ఏపీ మూడు రాజధానుల అంశం, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ మేనిఫెస్టోపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్, ఏపీ న్యూస్
  మంత్రి వెల్లంపల్లి (ఫైల్ ఫొటో)


  ఢిల్లీ నుంచి నియోజకవర్గానికి రాకుండా తమపై విమర్శలు చేయడం తగదని అన్నారు. ప్రజల ప్రాణం, ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని ఒక మతానికి అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వినాయక చవితి ఉత్సవాలపై నిర్ణయం తీసుకునే ముందు ఇతర రాజకీయ పక్షాలతోను, స్వామిజీలతోను మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రజలంతా వినాయక చవిత వేడుకలను ఇళ్లకే పరిమితమై చేసుకునే విధంగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: