వారిపై క్రిమినల్ కేసులు... ఏపీ మంత్రి వార్నింగ్

బిజెపికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు వైసిపి అధినేత జగన్‌పై విమర్శలు చేస్తున్నారని, అలాగే అన్యమత ప్రచారం అంటూ జగన్ ప్రభుత్వంపై నిందలు వేసున్నారని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.

news18-telugu
Updated: November 16, 2019, 7:20 PM IST
వారిపై క్రిమినల్ కేసులు... ఏపీ మంత్రి వార్నింగ్
పవన్ కళ్యాణ్, చంద్రబాబు
  • Share this:
ప్రభుత్వాన్ని, సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. బిజెపికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు వైసిపి అధినేత జగన్‌పై విమర్శలు చేస్తున్నారని, అలాగే అన్యమత ప్రచారం అంటూ జగన్ ప్రభుత్వంపై నిందలు వేసున్నారని ఆరోపించారు. అన్యమత ప్రచారం అంటూ చేస్తున్న ఆరోపణలపై ఆ ఇద్దరూ చర్చకు సిద్ధమా అని సవాలు ఆయన సవాల్ విసిరారు. ఇలా ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు.

ప్రతిపక్షాలకు మాట్లాడే చాన్స్‌ కూడా ఇవ్వకుండా ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ జగన్‌ ఐదు నెలల పాలనలోనే అందిస్తున్నారన్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిని ఎదుర్కోవడానికి ఎటువంటి పరిస్థితులు లేకపోవడంతో సున్నితమైన మతపరమైన అంశాలను తెరమీదకు తెచ్చి ప్రభుత్వంపై బురదజల్లేందుకు చంద్రబాబు, పవన్, ఇతర రాజకీయ పార్టీలు ఆరోపలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. హిందూ దేవాలయాలు, అర్చకుల అభివృద్ధికి రూ. 234 కోట్లు మొదటి బడ్జెట్‌లో కేటాయించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని గుర్తుచేశారు.






First published: November 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...