సీఎం జగన్‌పై పందుల్లా... ఏపీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

కరోనాపై మోదీ మొదలుకుని ప్రతీ ఒక్కరూ చెప్పే శుభ్రతనే సీఎం జగన్ చెప్పారని ఏపీ మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.

 • Share this:
  విపక్షాలపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరెక్ట్‌గా వారం రోజులు వదిలేస్తే ఎన్నికలు అయిపోతాయని... రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తాయని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అలాంటి ముఖ్యమంత్రిపై పందుల్లా కొన్ని రాజకీయపార్టీలు దండయాత్ర చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ఆటంకం కల్పించడానికి మొట్టమొదట నుంచి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మొదలు ఆయన చెంచా పవన్‌కళ్యాణ్, మౌత్‌ వాయిస్‌ కన్నా లక్ష్మీనారాయణ, మిగిలిన వామపక్షాలు అన్నీ సీఎం జగన్ మీద ఆరోపణలు చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  కరోనాపై మోదీ మొదలుకుని ప్రతీ ఒక్కరూ చెప్పే శుభ్రతనే సీఎం జగన్ చెప్పారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాత్రం కరోనాపై ప్రజల్ని తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో ఆందోళన ఉన్న సమయంలో ధైర్యం చెప్పాల్సింది పోయి... లేని కరోనాను ఉన్నట్లుగా చంద్రబాబు అండ్‌ కో చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే బాధేస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌పై కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను వెల్లంపల్లి తీవ్రంగా ఖండించారు.

  సీఎం జగన్‌పై పందుల్లా... ఏపీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు | Minister vellampalli comments on tdp bjp for comments on cm ys jagan mohan reddy ak
  సీఎం జగన్‌తో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (ఫైల్ ఫోటో)


  చంద్రబాబు, కన్నా, పవన్‌ ముగ్గురూ వేర్వేరు వేదికల్లో ఒకే మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మేలు జరగాలన్న ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఎన్నికల సంఘం తీరును ఆయన తప్పుబట్టారు. సీఎం జగన్ కరోనాపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళుతున్నారని... సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: