చంద్రబాబు ఎక్కడ?.. అన్నీ చేస్తున్నామన్న ఏపీ మంత్రి

చంద్రబాబు

చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు కరోనా విపత్తులో పత్తా‌లేకుండా పోయారని ఏపీ మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు.

 • Share this:
  ఏపీలో కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు ఏ ఒక్కరికైనా భరోసా ఇవ్వగలిగారా ? అని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఏపీకి వచ్చిన చంద్రబాబు కేవలం అచ్చెన్నాయుడు ఇష్యూపై హడావుడి చేసి వెళ్లిపోయారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు కరోనా విపత్తులో పత్తా‌లేకుండా పోయారని మండిపడ్డారు. కోవిడ్‌ను కూడా రాజకీయం చేయడం బాధాకరమని మంత్రి వెల్లంపల్లి అన్నారు. కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణపై కలెక్టర్, ఇతర అధికారులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. కరోనా పరీక్షల విషయంలో కృష్ణా జిల్లా ఏపీలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉందని ఆయన అన్నారు.

  ఇప్పటివరకు జిల్లాలో 2 లక్షల 10 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. జిల్లాలో 6 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. కరోనా చికిత్స కోసం ఆస్పత్రులలో బెడ్ల సామర్ద్యాన్ని పెంచానమి.. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కరోనాకు ఆరోగ్య శ్రీ కింద‌ వైద్యం అందిస్తున్నామని వివరించారు. డబ్బుకు వెనుకాడకుండా వైద్యం అందించాలన్నే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

  Ap news, ap latest news, chandrababu naidu, vellampalli srinivasa rao, corona virus, ఏపీ న్యూస్, ఏపీ తాజా వార్తలు, చంద్రబాబునాయుడు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కరోనా వైరస్
  మంత్రి వెల్లంపల్లి (ఫైల్ ఫొటో)


  ప్రభుత్వ విధి విధానాలను జిల్లా యంత్రాంగం పాటిస్తుందని.. జిల్లాలో కేసులు తగ్గడానికి ముందస్తుగా తీసుకున్న చర్యలే కారణమని వ్యాఖ్యానించారు. హోం క్వారంటైన్ వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారని.. ఎవరూ భయపడాల్సిన పని లేదని మంత్రి వెల్లంపల్లి అన్నారు. విజయవాడలో 11 ప్రాంతాల్లో కేసుల తీవ్రత ద్రుష్డ్యా నిబంధనలు పెట్టామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. పరీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో వాటి రిజల్ట్ త్వరగా వచ్చేందుకు మరో 7 పరికరాలను అందుబాటులో ఉంచామని వివరించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: