బీజేపీకి ఆ మాత్రం ఓట్లు కూడా రాలేదు... మంత్రి సెటైర్లు

ప్రభుత్వ పనితీరుకు హుజూర్ నగర్ ఫలితాలు ఒక నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

news18-telugu
Updated: October 25, 2019, 12:01 PM IST
బీజేపీకి ఆ మాత్రం ఓట్లు కూడా రాలేదు... మంత్రి సెటైర్లు
తలసాని శ్రీనివాస్ యాదవ్(ఫైల్ ఫోటో)
  • Share this:
హుజూర్ నగర్ ప్రజలు తీరు ప్రతిపక్షాలకు ఒక గుణపాఠమని అన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రతిపక్షాలు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు. ప్రతిపక్షాలు మీడియా ముందు అరవడం కాదని... ప్రజల్లోకి రావాలని ఆయన అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీపై మంత్రి తలసాని తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు. ఓ వార్డు సభ్యుడికి వచ్చిన ఓట్లు కూడా బీజేపీ అభ్యర్థికి రాలేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని తలసాని అన్నారు.

ప్రభుత్వ పనితీరుకు హుజూర్ నగర్ ఫలితాలు ఒక నిదర్శనమని అన్నారు. 60 సంవత్సరాల లో జరగని అభివృద్ధి గడిచిన 5 సంవత్సరాలలోజరిగిందని తలసాని వ్యాఖ్యానించారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.






First published: October 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com