MINISTER SON GETS BENZ CAR AS CORRUPTION EX MINISTER AYYANNA PATRUDU COMPLAINT TO ACB SK
ఏపీ మంత్రి కుమారుడికి బెంజి కారు లంచం.. ఏసీబీకి టీడీపీ నేత ఫిర్యాదు
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు బెంజి కారు ఇస్తున్న ఫొటోను మీడియాకు విడుదల చేశారు అయ్యన్నపాత్రుడు. ముద్దాయికి, మంత్రి కుమారుడికి సంబంధమేంటో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీ కార్మికశాఖ మంత్రి జయరాంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కుమారుడికి ఓ కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి బెంజి కారు లంచంగా ఇచ్చాడని ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన అయన్నపాత్రుడు.. కార్మికశాఖ మంత్రి జయరాంకు ఓ కేసులో ఏ14గా ఉన్న వ్యక్తి బినామీ అని, అందుకే ఆయన కుమారుడికి బెంజి కారు గిఫ్ట్‌గా ఇచ్చాడని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు బెంజి కారు ఇస్తున్న ఫొటోను మీడియాకు విడుదల చేశారు అయ్యన్నపాత్రుడు. ముద్దాయికి, మంత్రి కుమారుడికి సంబంధమేంటో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
''మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు ఓ ముద్దాయి బెంజి కారును బహూకరించాడు. మంత్రికి బినామీ కాబట్టే కారును ఇచ్చాడు. అది పుట్టిన రోజు కానుక కాదు. లంచం. అసలు ముద్దాయికి, ఈశ్వర్‌కు సంబంధమేంటో తేల్చాలి. ఈ విషయమై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. జయరాంను మంత్రి మండలి నుంచి తప్పించాలి. ఇలాంటి పరిస్థితిలో జయరాంను మంత్రిగా కొనసాగించడం న్యాయం కాదు. దీనిపై ప్రభుత్వం ఏ కమిటీ వేసినా ఆధారాలు చూపడానికి సిద్ధంగా ఉన్నా. ఎలాంటి ఆధారాలూ లేకుండా తెదేపా నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. ఆధారాలు లేకుండా బీసీ నాయకుల జోలికొస్తే సమాధి అవుతారు.'' అని అయ్యన్నపాత్రుడు అన్నారు.
మీడియా సమావేశం నుంచే అవినీతి నిరోధక శాఖ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు అయ్యన్నపాత్రుడు. ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కంపెనీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ స్కామ్‌లో కార్మిశాఖ మంత్రి జయరాం, ఆయన కుమారుడు ఈశ్వర్ హస్తముందని చెప్పారు. రాష్ట్రంలో ఏదైనా అవినీతి జరిగితే ఫోన్ చేసిన 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోందన్న ఆయన.. తన ఫిర్యాదుపైనా అంతేవేగంగా స్పందించాలని కోరారు. ఈ స్కామ్‌లో వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని.. ఈ విషయంలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు అయ్యన్నపాత్రుడు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.