మంత్రి సోమిరెడ్డికి షాక్.. వైసీపీలో చేరిన సోదరుడు సుధాకర్ రెడ్డి..

కుటుంబ సభ్యులే పార్టీని వీడుతుండటం రాబోయే ఎన్నికల్లో సోమిరెడ్డికి ప్రతికూలంగా మారుతుందా అన్న చర్చ జరుగుతోంది. సర్వేపల్లిలో ఇప్పటికే వరుసగా మూడుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డి.. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు.

news18-telugu
Updated: February 24, 2019, 6:12 PM IST
మంత్రి సోమిరెడ్డికి షాక్.. వైసీపీలో చేరిన సోదరుడు సుధాకర్ రెడ్డి..
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(File)
  • Share this:
ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి వైసీపీలో చేరారు. దీంతో నెల్లూరు జిల్లా టీడీపీకి షాక్ తగిలినట్టయింది. సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో సుధాకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కొంతమంది అనుచరులు కూడా పార్టీలో చేరారు. సోమిరెడ్డికి స్వయానా బావ అయిన రామ కోటారెడ్డి వైసీపీలో చేరిన కొద్దిరోజులకే ఆయన సోదరుడు కూడా పార్టీ వీడటం చర్చనీయాంశంగా మారింది.

రాబోయే ఎన్నికల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి గెలుపుకు తాను కృషి చేస్తానని.. వైసీపీలో చేరిన అనంతరం సుధాకర్ రెడ్డి అన్నారు. సుధాకర్ రెడ్డి పార్టీలోకి రావడం శుభ పరిణామం అన్న కాకాణి.. టీడీపీలో అవినీతి, అక్రమాలను సహించలేకనే నేతలు పార్టీ మారుతున్నారని అన్నారు. సర్వేపల్లిలో టీడీపీ ఇప్పటికే ఉనికిని కోల్పోయిందని.. రాబోయే ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగనే అని, ఆయన్ను గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.


ఇదిలా ఉంటే, కుటుంబ సభ్యులే పార్టీని వీడుతుండటం రాబోయే ఎన్నికల్లో సోమిరెడ్డికి ప్రతికూలంగా మారుతుందా అన్న చర్చ జరుగుతోంది. సర్వేపల్లిలో ఇప్పటికే వరుసగా మూడుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డి.. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు. ఇటీవలే తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇలాంటి తరుణంలో సొంత కుటుంబం నుంచే వైసీపీలోకి వలసలు సోమిరెడ్డికి మింగుపడని విషయమే అంటున్నారు.
First published: February 24, 2019, 6:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading