ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల ధలపై (Movie Tickets Issue) టాలీవుడ్ హీరో నాని (Hero Nani) చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, కురసాల కన్నబాబుతో పాటు పలువురు నేతలు నాని కామెంట్స్ ను తప్పుబట్టారు. ఏపీ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదని... మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడలన్నారు. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో మాఫియా ఉందని.. దానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు చెబుతున్నారు. అధికార వైసీపీ నేతలు నాని కామెంట్స్ విమర్శిస్తుండగా.. ప్రతిపక్ష టీడీపీ మాత్రం మద్దతిస్తోంది. ఇప్పటికైనా టికెట్ ధరలపై సినీ ఇండస్ట్రీకి నొప్పి తగిలిందంటున్నారు. మరోవైపు ఈ అంశంలో కొందరు నిర్మాతలు నాని నోరు జారాడని అంటుంటే మరికొందరు మాత్రం సరిగ్గానే మాట్లాడరాని చెబుతున్నారు.
ప్రభుత్వం పై కొంత మంది కక్షగట్టి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. కిరణాకొట్లన్నీ లాభాల్లో ఉండవనీ... సినిమాలన్నీ లాభాల్లో ఉండవన్నారు. ఈ ఐదు రూపాయలు, పది రూపాయల టికెట్ల విధానం తమ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టలేదని.. ఎప్పటి నుంచో ఉందన్నారు. తమకు థియేటర్ల మీద, హీరోల మీద, ప్రొడ్యూసర్లపై కక్ష లేదన్నారు. కొంతమంది మాఫియాగా ఏర్పడి ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు మేలు చేసేందుకే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
హీరో నాని కామెంట్స్ పై మరో మంత్రి కన్నబాబు మండిపడ్డారు. కిరాణ షాపులు అంటే ఆయనకు చులకనగా కనపడ్డాయా..? సినిమా టికెట్లు ధరలు తగ్గిస్తే ప్రజలను అవమానించడమా..? రేట్లు పెంచితే గౌరవించినట్లా..? అని కన్నబాబు ప్రశ్నించారు. ఏ వ్యవస్థ కూడా ప్రజల మీద భారం వేయకుండా చూడటం అనేది ప్రభుత్వాల బాధ్యతన్న కన్నబాబు... సినిమాకు వెళితే సగటు ప్రేక్షకుడిని ఏవిధంగా పీడిస్తున్నారో అందరికీ తెలుసన్నారు. టికెట్ల ధరలు ఇష్టానుసారం పెంచుతుంటే ఇంతకాలం ఎవరూ మాట్లాడలేదని.., ఇప్పుడు మేము మాట్లాడుతుంటే.. కక్షసాధింపుగా మాట్లాడుతున్నట్లు ఉందన్ను. నాని మాటలకు అర్థం ఏంటో ఆయనే చెప్పాలి. వాళ్లే మాట్లాడుకుని.. వాళ్లే వివాదాలు తెచ్చుకుంటున్నారని.. థియేటర్లు తనిఖీలు చేస్తే తప్పా? ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయని కన్నబాబు గుర్తుచేశారు.
హీరో నాని వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలనే టికెట్ ధరలు తగ్గించామని బొత్స అన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలని, తమకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఒకవేళ మార్కెట్లో ఏదైనా కొంటే దానికి ఎమ్మార్పీ ఉంటుంది కదా అని ఆయన అన్నారు. ప్రేక్షకులను తామెందుకు అవమానిస్తామని మండిపడ్డారు. టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా..? అని బొత్స సత్యాన్నారయణ ప్రశ్నించారు. మేమింతే.. ఎంతంటే అంత వసూలు చేస్తామంటే కుదరదని ఆయన వెల్లడించారు. సినిమా చూసేవారికి మేలు చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.