ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసారు.. బాల్కొండ మండ‌లం ప‌చ్చ‌లన‌డికుడ గ్రామంలో వ‌రి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని అయ‌న ప్రారంభించారు.

news18-telugu
Updated: April 17, 2020, 2:04 PM IST
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి
  • Share this:
నిజామాబాద్: భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా రైతులు పండించే ధాన్యాన్ని వంద శాతం కొనుగోళ్లు చేయదు.. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం టిర్ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన వరి దాన్యాన్ని వంద శాతం కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాస‌నస‌భ వ్య‌వ‌హ‌రాల శాఖ మంత్రి వేముల ప్రశాంతి రెడ్డి చెప్పారు.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో కరుణ వైరస్ కారణంగా రైతులు ధాన్యం విక్రయించడం ఇబ్బంది అవుతుందని మ‌ద్ద‌తు ధ‌ర‌కే ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌న్నారు.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసారు.. బాల్కొండ మండ‌లం ప‌చ్చ‌లన‌డికుడ గ్రామంలో వ‌రి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని అయ‌న ప్రారంభించారు. ఆనంత‌రం గ్రామంలోని స‌ఫాయి కార్మికుల‌కు, నిరుపేద‌ల‌కు కూర‌గాయ‌లు, బియ్యం, ప‌ప్పులు, నూనే త‌దిత‌ర సామాగ్రి అందించారు. మ‌రో వైపు బీంగ‌ల్ మున్సిపాల్టి పరిధిలో క్వారెంటేన్ లో ఉన్న వారిని ప‌ర‌మార్శించారు.. వారికీ వ‌స‌తులు ఏలా ఉన్నాయి అడిగి తెలుసుకున్నారు. మీరు మ‌రి కొన్ని రోజులు స‌హ‌క‌రిస్తే ఇంటికి పంపిస్తార‌ని మంత్రి దైర్యం
చెప్పారు.. క‌రోనా వైర‌స్ నిర్మూల‌ను సామాజక దూరం ఒక్కటే ప‌రిష్కారం అని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు.. రైతులు ఎవ‌రు కూడా తొంద‌ర పడ‌వ‌ద్దు చివ‌రి దాన్యం గింజ వ‌ర‌కు ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని అయ‌న భారోసా ఇచ్చారు.. వారం రోజుల్లో మీ డ‌బ్బులు మీ ఆకౌంట్ లోకి వ‌స్తాయని చెప్పారు..
First published: April 17, 2020, 1:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading