కేంద్రంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: December 4, 2019, 11:44 AM IST
కేంద్రంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్ ఫైల్ ఫోటో(Image:Facebook)
  • Share this:
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సీఐఐ నిర్వహించిన సదస్సులో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ కారణాలతోనే కేంద్రం ఈ రకంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన అనేక ప్రాజెక్టులు రావడం లేదని... చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. అభివృద్ధి కేవలం నాగ్‌పూర్‌కేనా ? అని కేటీఆర్ కామెంట్ చేశారు. దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపిస్తోందని అన్నారు.

అభివృద్ధిని కేవలం గుజరాత్, మహారాష్ట్ర, చెన్నై వంటి నగరాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని... ప్రపంచస్థాయి మౌలిక వసతులు ఉన్న హైదరాబాద్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్‌ను సైతం కేంద్రం పెద్దగా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>