అమీర్‌పేట్ మెట్రో ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్...

కేటీఆర్(ఫైల్ ఫోటో)

అమీర్‌పేట్ మెట్రో పిల్లర్ ప్రమాదంపై ఉన్నత స్థాయి ఇంజినీరింగ్ అధికారుల బృందంతో విచారణ జరపాలని కేటీఆర్ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు.

  • Share this:
    అమీర్‌పేట్‌లో మెట్రో పిల్లర్ పెచ్చూలుడి పడి మహిళ చనిపోయిన ఘటనపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర ఘటనన్న మంత్రి.. మౌనిక కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇక జరిగిన ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. అమీర్‌పేట్ మెట్రో పిల్లర్ ప్రమాదంపై ఉన్నత స్థాయి ఇంజినీరింగ్ అధికారుల బృందంతో విచారణ జరపాలని కేటీఆర్ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు.


    మరోవైపు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలు మౌనిక భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందని తేలితే సెక్షన్ 304(A) కింద విచారణ జరిపే అవకాశముంది. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారందరినీ విచారిస్తామని పంజాగుట్ట ఏసీపీ స్పష్టం చేశారు.

    ఆదివారం అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ పెచ్చులు ఊడి మౌనికపై పడ్డాయి. నేరుగా తల మీద పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో హైదరాబాద్ మెట్రో పిల్లర నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ అండ్ టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.


    First published: