• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MINISTER KTR FIRES ON BJP AND CONGRESS LEADERS IN WARANGAL TOUR SU

Minister KTR: ఇదే లాస్ట్ వార్నింగ్.. ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి కేటీఆర్..

Minister KTR: ఇదే లాస్ట్ వార్నింగ్.. ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి కేటీఆర్..

మంత్రి కేటీఆర్

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కేసీఆర్‌పై నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఉరుకునే ప్రస్తక్తే లేదని హెచ్చరించారు.

  • Share this:
    వరంగల్ నగరంలో తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌ వయసు, హోదా చూడకుండా మాట్లాడుతున్నారని.. ఆయనను తిడితే ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇదే చివరి హెచ్చరిక తేల్చి చెప్పారు. ఉద్యోగాల పేరుతో రాజకీయాలు చేయవద్దన్నారు. కొందరు నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్‌ నగరాభివృద్ధికి ఎన్నికోట్లు ఇచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. తామిచ్చిన డబ్బుకు రెట్టింపు కేంద్రం నుంచి తీసుకురాగలరా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని అద్భుత‌మైన న‌గ‌రంగా తీర్చిదిద్దే బాధ్య‌త టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ పెట్టార‌ని చెప్పారు.

    ఉగాదికి ఒకరోజు ముందే నగరంలో ఇంటింటికి తాగునీరు అందించామని మంత్రి చెప్పారు. ఎన్నిక ఏదైనా కేసీఆరే మా నాయ‌కుడు అని ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా తీర్పు ఇచ్చారో.. రాబోయే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ ఆ ర‌క‌మైన తీర్పును ఇవ్వాల‌ని కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. కరోనా వేళ ఆదాయం తగ్గినా.. సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేస్తున్నామని చెప్పారు.

    CM KCR: నాగార్జున సాగర్‌లో కేసీఆర్ సభకు అడ్డంకులు తొలగినట్టేనా..? సభ ఆపాలన్న పిటిషన్లపై హైకోర్టు ఏమందంటే..?



    కేయూ స్టూడెంట్ బోడ సునీల్ ఆత్మహత్య గురించి కూడ కేటీఆర్ ప్రస్తావించారు. రెచ్చగొట్టడం వల్లే సునీల్ చనిపోయాడని అన్నారు.. సునీల్‌కు బ్రెయిన్ వాష్ చేయడం వల్లే సునీల్ కేసీఆర్ గురించి మాట్లాడారన్నారు. ఐఏఎస్ కావాల్సిన వాడినని బోడ సునీల్ వీడియోలో చెప్పాడని.. ఐఏఎస్‌లను భర్తీ చేసే నోటిఫికేషన్లు ఎవరిస్తారు? అని ప్రశ్నించారు. తనను అడ్డుకోవాలని చూసిన ఏబీవీపీ నాయకులను ఉద్దేశించి కూడా కేటీఆర్ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్ని ఉద్యోగాలిచ్చారు అని కేటీఆర్ వారిని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ఉత్తమ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు