కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ..

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి లేఖ రాశారు.

news18-telugu
Updated: August 16, 2020, 5:44 PM IST
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ..
మంత్రి కేటీఆర్
  • Share this:
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారుల తీరు మీద ఆయన కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. కంటోన్మెంట్‌లో అధికారులు తమకు నచ్చినట్టు రోడ్లను మూసేస్తున్నారని, దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ ఉత్తర, ఈశాన్య ప్రాంతాలకు చెందిన ప్రజలకు కంటోన్మెంట్‌లోని దారుల నుంచే వచ్చి వెళ్తుంటారని, సడన్‌గా అక్కడ రోడ్లు మూసేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తరచుగా, సడన్‌గా, అప్రకటితంగా రోడ్లను మూసేయడం వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉందని, అయినా దాన్ని పాటించడం లేదన్నారు. కంటోన్మెంట్ జోన్లలో రోడ్లు మూసివేత, ఇతరత్రా నిర్ణయాలకు సంబంధించి మొదట పేపర్లలో ప్రకటన ఇచ్చి, ఆ తర్వాత దాని మీద ఫీడ్ బ్యాక్ తీసుకుని ఆ తర్వాత డిఫెన్స్ వారు నిర్ణయం తీసుకోవాలన్నారు. కానీ, స్థానిక డిఫెన్స్ అధికారులు మాత్రం ఇవేవీ పాటించకుండా తమకు నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కంటోన్మెంట్ రహదారి నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే రోడ్డు కనెక్టివిటీ ఉందని, రోజుకు సుమారు 10 లక్షల మంది దీన్ని వినియోగిస్తారని చెప్పారు. రక్షణ శాఖ అధికారులు తీసుకునే సడన్ నిర్ణయాల వల్ల వారంతా ఇబ్బందులు పడుతున్నట్టు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, ఎన్నికైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనుసరించాల్సిన ప్రోటోకాల్స్ పాటించడం లేదన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 16, 2020, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading