కేసీఆర్ ఫెయిలైతే మోదీ కూడా విఫలమైనట్టే.. విమర్శలు వద్దన్న కేటీఆర్

కరోనా సంక్షోభ సమయంలో మంత్రి ఈటల రాజేందర్ ఎంతో గొప్పగా పని చేస్తున్నారని కేటీఆర్ కితాబిచ్చారు.

news18-telugu
Updated: July 13, 2020, 7:33 PM IST
కేసీఆర్ ఫెయిలైతే మోదీ కూడా విఫలమైనట్టే.. విమర్శలు వద్దన్న కేటీఆర్
మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా సమస్య ఇప్పుడప్పుడే మనల్ని వదిలిపోయే పరిస్థితి లేదని కేటీఆర్ అన్నారు. జాగ్రత్తలు తీసుకుంటూనే కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. కరోనా కట్టడిలో కేసీఆర్ విఫలమయ్యారన్న విమర్శలు అర్థరహితమని కేటీఆర్ అన్నారు. కరోనా విషయంలో ప్రపంచంలోనే మన దేశం మూడో స్థానంలో ఉందని... అలాంటప్పుడు ఈ విషయంలో ప్రధాని మోదీ కరోనా కట్టడిలో ఫెయిలయ్యారని అనుకోవాలా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. క్లిష్ట సమయంలో ఒకరినొకరు విమర్శించుకోవడం సరికాదని ఆయన సూచించారు.

కరోనా సంక్షోభ సమయంలో మంత్రి ఈటల రాజేందర్ ఎంతో గొప్పగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. కరోనా చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రులే అద్భుతంగా పని చేస్తున్నామని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు ఈటల, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. కరోనా విషయంలో వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరించవద్దని మీడియాకు సూచించారు.
Published by: Kishore Akkaladevi
First published: July 13, 2020, 1:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading