KTR: నేను అలా అనలేదు.. గ్రేటర్ ఎన్నికలపై కేటీఆర్ వివరణ

KTR: జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నవంబర్ రెండో వారం తరువాత ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని తాను చెప్పానని.. ఇందుకు పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని అన్నానని కేటీఆర్‌ వివరించారు.

news18-telugu
Updated: September 30, 2020, 2:43 PM IST
KTR: నేను అలా అనలేదు.. గ్రేటర్ ఎన్నికలపై కేటీఆర్ వివరణ
కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
నవంబర్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తాను అన్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నవంబర్ రెండో వారం తరువాత ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని తాను చెప్పానని.. ఇందుకు పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని అన్నానని కేటీఆర్‌ వివరించారు. ఎన్నిక‌ల షెడ్యూల్‌, నిర్వహణ పూర్తిగా ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రిధిలోని అంశ‌మ‌ని కేటీఆర్ స్పష్టం చేశారు. స‌ద‌రు మీడియా సంస్థలు తాను అనని మాటలను తనకు అపాదించడం జరిగిందని.. అది సరికాదని కేటీఆర్ వెల్లడించారు.



నిన్న గ్రేటర్‌కు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో సమావేశమైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నవంబర్‌ రెండో తరువాత ఎప్పుడైన ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు. దీంతొ గ్రేటర్‌లో షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు రావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. గ్రేటర్‌లో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోందనే ప్రచారం జోరందుకుంది. సర్వేలన్నీ తెలంగాణ రాష్ట్ర సమితికే అనుకూలంగా ఉన్నాయని ఈ సమావేశంలో వ్యాఖ్యానించిన కేటీఆర్... ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 91 సీట్లు కచ్చితంగా వస్తాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.

15 శాతం మంది కార్పొరేటర్ల పనితీరు మారాలని సూచించారు. జనంతో మమేకమై వారితో కలిసి పనిచేస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ నగరాన్ని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నామని తెలిపిన కేటీఆర్... అందులో భాగంగానే గత ఐదేండ్లలో అభివృద్ధి కార్యక్రమాల కోసం 67వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని అన్నారు. ట్రాఫిక్‌ జాంలు లేకుండా, సాఫీగా సాగిపోయేలా రోడ్లను అభివృద్ధి చేశాం. పరిశ్రమల పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామని అన్నారు. తమ పాలనలో నగరానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: September 30, 2020, 2:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading