Home /News /politics /

MINISTER KTR CALLED HIS SISTER KAVITHA AS PAPPU ON THE OCCASION OF HIS BIRTHDAY SK

KTR-Kavitha: ఎమ్మెల్సీ కవిత నిక్ నేమ్ ఏంటో తెలుసా? తొలిసారి బయటపెట్టిన మంత్రి కేటీఆర్

కవిత, కేటీఆర్

కవిత, కేటీఆర్

KTR Birthday: కేటీఆర్ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. బర్త్ డేను పురస్కరించుకొని 100 మంది వికలాంగులకు స్కూటీలను గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

    ఇవాళ తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (KTR) పుట్టిన రోజు. కేటీఆర్ బర్త్ డేను టీఆర్ఎస్ శ్రేణులంతా ఘనంగా జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామయ్యారు. ఆ పార్టీ నేతలు తెలంగాణ భవన్‌లో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఇక మంత్రి కేటీఆర్‌కు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సినీ నటుటు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ కవిత కూడా తన సోదరుడికి బర్త్ డే విషెస్ చెప్పారు. ''హ్యాపీ బర్త్ డే అన్నయ్యా.. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. మరిన్ని విజయాలు సాధించాలి.'' అని ట్వీట్ చేశారు కవిత.

    కవిత ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. థ్యాంక్యూ పప్పు.. అని రిప్లై ఇచ్చారు. కవితను మీరు పప్పు అని పిలుస్తారా? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కవిత నిక్ నేమ్ తొలిసారి బయటపెట్టారు అంటూ సరదాగా ట్వీట్స్ చేస్తున్నారు.

    మరోవైపు కేటీఆర్ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. బర్త్ డేను పురస్కరించుకొని 100 మంది వికలాంగులకు స్కూటీలను గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తన పుట్టిన రోజు నాడు కేకులు, బొకేలు, ఫ్లెక్సీ కోసం డబ్బులను వృథా చేయకూడదని పిలుపునిచ్చారు. వాటిని మంచి కార్యక్రమాల కోసం వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చాలా మంది నేతలు దివ్యాంగులకు స్కూటీలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వారందరికీ కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Kavitha, KTR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు