కేటీఆర్‌కు సూపర్ పంచ్ ఇచ్చిన కవిత.. అన్నాచెల్లెళ్ల ఆసక్తికర సంభాషణ..

కేటీఆర్‌తో సెల్ఫీ తీసుకుంటున్న కవిత (ఫైల్ ఫోటో)

ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆ సమాధానానికి ఆయన చెల్లి.. కల్వకుంట్ల కవిత మరింత ఆసక్తి రేపే ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

  • Share this:
    ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆ సమాధానానికి ఆయన చెల్లి.. కల్వకుంట్ల కవిత మరింత ఆసక్తి రేపే ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. రీట్వీట్లు, లైకులతో హోరెత్తిపోతోంది. వివరాల్లోకెళితే.. ఏప్రిల్ 20 తర్వాతైనా హెయిర్ కటింగ్ తెరిచే సూచనలు ఉన్నాయా? అని ఓ నెటిజన్ కేటీఆర్‌ను ప్రశ్నించాడు. లేకపోతే.. తన భార్యే హెయిర్ కట్ చేస్తానని అంటోందంటూ ట్వీట్ చేశాడు. దానికి మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. ‘టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆయన భార్య అనుష్క శర్మ హెయిర్ కట్ చేసింది. అలాంటప్పుడు నీవెందుకు చేయించుకోవు?’ అంటూ ఫన్నీగా జవాబిచ్చారు.

    అంతే.. ఈ సీన్‌లోకి కవిత ఎంటర్ అయ్యారు. ఆమె ఎంటర్ అవడంతోనే సీన్ అంతా రక్తికట్టేలా తయారైంది. నెటిజన్‌కు కేటీఆర్ ఇచ్చిన రిప్లైని చూసిన కవిత.. ‘అన్నయ్యా.. బాబీకి కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నావా?’ అని ట్వీట్ చేశారు. ఇంకేముంది.. ఈ ఆసక్తికర ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అన్నా,చెల్లెళ్ల సంభాషణకు అభిమానులు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ముగ్ధులవుతున్నారు. పంచ్ మాస్టర్‌కే పంచ్ పడిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: