MINISTER KODALI NANI VS YSRCP PARTY LEADER YERLLA GEDDA VENKATRAO IN KRISHNA DISTRICT BK
Kodali Nani: ఏపీలో మంత్రి కొడాలి నానికి ఆ నేతతో చెడిందా?
మంత్రి కొడాలి నాని (ఫైల్)
ఒకప్పుడు చెట్టపట్టాలేసుకొని తిరిగిన ఆ నేతలిద్దరూ ఇప్పుడు ఎడమొహాం పెడమొహం పెడుతున్నారంటా. వాస్తవానికి ఆయన్నిరాజకీయాల్లో తీసుకొచ్చింది ఆ మంత్రిగారే అయినప్పటికి ఎమైందో ఎమో తెలేదు ఇప్పుడు తన పాత స్నేహితుడిని పక్కన పెట్టుకొని తిరగడం ఈ స్నేహితుల మధ్య చిచ్చుకు కారణంగా తెలుస్తోంది.
ఏపీలో అధికారపార్టీ నేతల మధ్య విభేదాలు చాప కింద నీరులా మారాయి. మొన్నిటికి మొన్న నగరి ఎమ్మెల్యే రోజా బహిరంగ సమావేశంలోనే తనను పార్టీలో కొంత మంది వ్యక్తులు ఎదగనివ్వడం లేదని వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా రాజకీయ దుమారం లేపారు. తరువాత ఏమైంది ఏమో కాని ఆమె పత్త లేకుండాపోయారు. పార్టీ కార్యకలాపాలకు కూడా అంటి ముట్టనట్లు వ్యవహారిస్తోంది ఈ ఫైర్ బ్రాండ్. తాజాగా కృష్ణా జిల్లా వైసీపీ రాజకీయాల్లో ఇద్దరు నేతల మధ్య వార్ తీవ్రస్థాయికి చేరిందనే టాక్ విపిస్తోంది. ఒకప్పుడు ఇద్దరు నేతలు దొస్త్ మేరా దొస్త్ అంటు చెట్టపట్టాలేసుకుని తిరిగి ఇప్పుడు ఎదురుపడితే చాలు మొఖం తిప్పేసుకుంటున్నారంటా ఆ ఇద్దరు నేతలు. ఒకప్పుడు ఇద్దరు నేతలు చెట్టపట్టలేసుకుని సడెన్ గా ఏమైంది వీళ్లకు అనే టాక్ ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారింది. కృష్ణా జిల్లా రాజకీయాలను కోడాలి నాని పేరు ప్రస్తావించకుండా మాట్లాడలేము అంత ప్రభావం ఉంటుంది ఆయని అక్కడ అయితే ఇప్పుడు ఈ నేతకు గతంలో ఇతని స్నేహితుడిగా పార్టీకి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు నెలకున్నాయని టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి ఎన్నారె గా ఉన్న యార్లగండ వెంకట్రావును పార్టీలోకి తీసుకొచ్చింది కోడాలి నాని నే ఆయన చెప్పడం వలనే వల్లభనేని వంశీ పై పోటీ చేయడానికి జగన్ యార్లగడ్డకు టిక్కెట్ కూడా ఇచ్చారు. అయితే అన్యూహాంగా ఆ ఎన్నికల్లో యార్లగడ వెంకట్రావు ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన కాస్త డల్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కోడాలి నానికి, వల్లభనేని వంశీకి కూడా గతం నుంచే స్నేహాం ఉంది. నాని టీడీపీ విడిచిపెట్టిన వారి మధ్య స్నేహాం అలానే కొనసాగుతూ వచ్చింది కూడా అయితే ఇప్పుడు ఈ స్నేహామే యార్లగడ్డ కు నానికి మధ్య వైరానికి కారణం అంటున్నారు పార్టీలో కొందరు కీలక నేతలు.
టీడీపీ లో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి వైసీపీకి ఆయన జై కొట్టడానికి మంత్రి కొడాలి నాని అనేది బహిరంగ రహాస్యం. ఆయనే వల్లభనేని వంశీని దగ్గరుండి ముఖ్యంత్రి జగన్ వద్దకు తీసుకెళ్లారు కూడా అయితే గత ఎన్నికల్లో వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయి బాధలో ఉన్న యార్లగడ్డను పట్టించుకోకుండా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సపోర్ట్ చేయడం ఈయనకు అస్సలు నచ్చడం లేదని టాక్ . గత ఎన్నికల సమయంలో యార్లగడ్డకు, వల్లభనేని వంశీకి మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలో జరిగింది. అయినప్పటికి ఆయన్ని మంత్రి కోడాలి నాని వెనకేసుకుని తిరడగం ఇప్పుడు ఇద్దర మధ్య చిచ్చు కారణమైందని పార్టీ వర్గాల టాక్.