• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MINISTER KODALI NANI SLAMS TDP CHIEF NARA CHANDRABABU NAIDU OVER CID CASE ON AMARAVATI LANDS SCAM FULL DETAILS HERE PRN

Kodali Nani: చంద్రబాబు కాదు... స్టే బాబు.. మంత్రి కొడాలి నాని కౌంటర్లు

Kodali Nani: చంద్రబాబు కాదు... స్టే బాబు.. మంత్రి కొడాలి నాని కౌంటర్లు

మంత్రి కొడాలి నాని (ఫైల్ ఫోటో)

Kodali Nani: చంద్రబాబునాయుడు (Nara Chandrababu naidu) ని స్టేలు బాబు కూడా పిలుస్తారని.. స్టేల బాబు మళ్లీ స్టే తెచ్చుకున్నారని కొడాలి నాని (Kodali Nani) చెప్పారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంపై రాజకీయాలు వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సీఐడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. నోటీసులివ్వడం, వాటిపై చంద్రబాబు నెలరోజుల పాటు స్టే తెచ్చుకోవడం జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఈ దేశ రాజకీయాల్లో అత్యంత పిరికి వ్యక్తి చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. విచారణలు ఎదుర్కోలేని వ్యక్తిగా ఈ భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే నారా చంద్రబాబు నాయుడు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు ని స్టేలు బాబు కూడా పిలుస్తారని.. స్టేల బాబు మళ్లీ స్టే తెచ్చుకున్నారని చెప్పారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి ఈ కేసును పూర్తిగా తీసివేయమని కోరిన చంద్రబాబు.. నాలుగు వారాలు స్టే తెచ్చుకున్నాడన్నారు.

    చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంతో పాటు పలుకుబడిని ఉపయోగించుకుని కోర్టుల్లో స్టేలు తెచ్చుకుంటాని కొడాలి నాని విమర్శించారు. సుప్రీం కోర్టు నుండి లక్షలు, కోట్లు ఖర్చుపెట్టి పెద్ద పెద్ద లాయర్లను తెచ్చుకుంటారన్నారు. కేసుల నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నా.. ప్రజాకోర్టు నుంచి మాత్రం తప్పించుకలేరని హెచ్చరించారు. చంద్రబాబు తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న కొడాలి నాని.. ఇప్పటికే చంద్రబాబుకు అనేకసార్లు బుద్ధి చెప్పారని తెలిపారు.

    ఇది చదవండి: విశాఖలో కలకలం... స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్.. సాయంత్రమే ముహూర్తం..



    రేపు రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు వేసే శిక్షతో చంద్రబాబు నాయుడును రోడ్డు మీదకు రాకుండా ఇంటికి పరిమితం చేస్తారని కొడాలి నాని అన్నారు. అతి భయంకరమైన శిక్షను చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు వేయడానికి సిద్ధంగా ఆయన జోస్యం చెప్పారు.

    కాగా అమరావతిలో దళితుల నుంచి భూములను బలవంతంగా లాక్కొని తమ బినామీలకు లబ్ధి చేకూర్చారని చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.

    ఈనెల 13న చంద్రబాబుపే సీఐడీ కేసులు నమోదు చేయగా.. ఆయనకు నోటీసులు ఇచ్చిన సందర్భంగా అసలు విషయం బయటకి వచ్చింది. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌), (జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సీఐడీ.. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను ఏ2గా పేర్కొన్నారు. అలాగే కొంత మంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు పొందుపరిచిన సీఐడీ.. వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు