Home /News /politics /

MINISTER KODALI NANI SLAMS TDP CHIEF NARA CHANDRA BABU NAIDU OVER PARISHAT ELECTIONS RESULTS FULL DETAILS HERE PRN

Kodali Nani: చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. మంత్రి కొడాలి నాని సవాల్

మంత్రి కొడాలి నాని (ఫైల్ ఫోటో)

మంత్రి కొడాలి నాని (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పరిషత్ ఎన్నికల ఫలితాలు (Parishat Elections Results) వచ్చిన తర్వాత అధికార వైఎస్ఆర్సీపీ (YSRCP).. ప్రతిపక్షంపై మాటల తూటాలు పేల్చుతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Nara Chandra Babu Naidu) పై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని (AP Minister Kodali Nani) మండిపడ్డారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పరిషత్ ఎన్నికల ఫలితాలు (Parishat Elections Results) వచ్చిన తర్వాత అధికార వైఎస్ఆర్సీపీ (YSRCP).. ప్రతిపక్షంపై మాటల తూటాలు పేల్చుతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Nara Chandra Babu Naidu) పై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని (AP Minister Kodali Nani) మండిపడ్డారు. జెడ్పీటీసీ, ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీని గెలిపించి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 99శాతం జిల్లా పరిషత్, 85శాతం మండల పరిషత్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుందన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో, స్వగ్రామమైన నారావారి పల్లెతో పాటు నిమ్మకూరులోని వైసీపీనే గెలిచిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి ఉందన్నారు కొడాలి నాని. కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరుతామని.. అక్కడ చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు.

    ఎన్నికలంటే భయం..!
    ఎన్నికలంటే చంద్రబాబుకు భయమన్న కొడాలి నాని.. మూడు రోజుల్లో ఎన్నికలనగా వాటిని వాయిదా వేయించి పారిపోయారన్నారు. కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి బషిష్కరించారని.. ఆతర్వాత కౌంటింగ్ వాయిదా వేయాలని కోర్టుకెళ్లారని కొడాలి నాని విమర్శించారు. ప్రజల్లో సీఎం జగన్ కు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. ఎన్నికలు బహిష్కరించినా టీడీపీ తరపున పోటీ చేసి 800 మంది విజయం సాధించారని.. వారంతా చంద్రబాబును ధిక్కరించిన వాళ్లేనా..? అని ప్రశ్నించారు.

    ఇది చదవండి: ఆ విషయంలో ఏపీ నెంబర్ వన్... సీఎం జగన్ కీలక ప్రసంగం...


    నేను తలుచుకుంటే..!
    టీడీపీ తరపున పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్లలో ఒకర్ని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోవాలని హితవుపలికారు. ప్రతిపక్షం ఖాళీ అయినట్లు చంద్రబాబు అంగీకరిస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్ ను నమ్ముకుంటే టీడీపీకి తెలంగాణలో పట్టిన గతే పడుతుందని ఎద్దేవా చేశారు. ఇక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నోటికొచ్చి మాట్లాడుతున్నారన్న కొడాలి నాని.. తాను తలుచుకుంటే ఇంకా దారుణంగా తిట్టకలని హెచ్చరించారు.

    ఇది చదవండి: శ్రీవారి భక్తులకు అలర్ట్... ఉచిత దర్శన టోకెన్లపై టీటీడీ సంచలన నిర్ణయం...


    కుప్పంలో వైసీపీ జోరు...
    ఇటీవల వెలువడిన పరిషత్ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబుకు ఎదురుగాలి వీచింది. ఇక్కడ వైసీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 19 ఎంపీటీసీ స్థానాలకుగానూ 17 వైసీపీ కైవసం చేసుకోగా.., 2 స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. రామకుప్పం మండలంలో 16 ఎంపిటిసి స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా... గుడిపాల మండలంలో 13 స్థానాల్లో 12 వైసీపీ, ఇతరులు ఒక్క స్థానంలో గెలుపొందారు. ఇక శాంతిపురం మండలంలో 18 స్థానాల్లో వైసీపీ 17 కైవసం చేసుకోగా... టీడీపీ ఒక్క స్థానంలో నిలిచింది. ఇక చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారి పల్లె ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాలుల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే..! 13 జిల్లా పరిషత్ లు అధికార పార్టీ ఖాతాలో చేరాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap local body elections, Chandrababu naidu, Kodali Nani, Kuppam, Tdp, Ysrcp

    తదుపరి వార్తలు