• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MINISTER KODALI NANI SLAMS JANASENA PARTY CHIEF PAWAN KALYAN AND TDP CHIEF CHANDRA BABU NAIDU OVER VIZAG STEEL PLANT ISSUE AND DEMANDS PAWAN TO QUESTION PRIME MINISTER NARENDRA MODI PRN

Kodali Nani vs Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు కొడాలి నాని బంపర్ ఆఫర్…

Kodali Nani vs Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు కొడాలి నాని బంపర్ ఆఫర్…

పవన్ కల్యాణ్ కు కొడాలి నాని బంపర్ ఆఫర్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) విషయంలో భారతీయ జనతాపార్టీ (BJP), జనసేనలు (Janasena) కాస్తవెనకబడ్డాయనే చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని చెప్పిన రెండు పార్టీలు ఇంతవరకు ప్రత్యక్ష పోరాటంలోకి దిగలేదు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం చిచ్చురేపింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టుకోవడం కోసం పోరాడుతున్నాయి. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశంతో పాటు వామపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ విషయంలో భారతీయ జనతాపార్టీ, జనసేనలు కాస్తవెనకబడ్డాయనే చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని చెప్పిన రెండు పార్టీలు ఇంతవరకు ప్రత్యక్ష పోరాటంలోకి దిగలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఉద్యమంలోకి రాలేరు. అలాగే బీజేపీతో పొత్తు కారణంగా జనసేన గట్టిగా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ హోంమంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారు.

    ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. అంతేకాదు జనసేనానికి ఓ బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న తమ పార్టీ ఎంపీలందరినీ పవన్ వద్దకు పంపిస్తానని.. దమ్ముంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని సవాల్ విసిరారు. “విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్లి ఆపేయమన్నారా. మమ్మల్ని ఆపేయమంటున్నారా... ఆయన మిత్రపక్షం బీజేపీతో పవన్ కళ్యాణే చెప్పాలి. ప్రైవేటీకరణను ఆపాలనే ఆలోచన జనసేన ఇతర పార్టీలకు ఉంటే.. వైయస్‌ఆర్‌సీపీతో కలిసి రావాలి. మీ విన్నపాలు తెలియజేయాలి. పోరాటం చేయాలంటే అన్ని పార్టీలు కలిసి చేయాలి తప్పితే.. ఇలాంటి సంక్షోభంలోనూ టీడీపీ, జనసేన రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం.” అంటూ వ్యాఖ్యానించారు.

    ఇది చదవండి: ఫస్ట్ ఫేజ్ ముగిసేసరికి సీన్ రివర్స్.. చంద్రబాబు ఎస్ఈసీని టార్గెట్ చేయడం వెనుక వ్యూహం అదేనా..?



    విశాఖ స్టీల్‌ ప్లాంట్ విషయంలో పార్లమెంట్‌లోను, బయట అన్నివిధాలా పోరాడుతూ, అన్ని చర్యలు వైయస్‌ఆర్‌సీపీ తీసుకుంటుందన్నారు కొడాలి నాని. ప్రధాని మోడీని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ గట్టిగా అడగాలని కొడాలి నాని సూచించారు. పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాతో నడుస్తారంటే నేనే దగ్గరుండి పోరాటం చేస్తానంటూ మరో ఆఫర్ ఇచ్చారు. మరి మంత్రిగారిచ్చిన ఆఫర్ కు అటు పవన్ కల్యాణ్.., ఇటు చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు