వైసీపీలోకి దేవినేని అవినాష్... కొడాలి నాని ఏమన్నారంటే...

దేవినేని అవినాష్‌ను గుడివాడలో పోటీ చేయించి.. రాజకీయ బలి పశువు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు.

news18-telugu
Updated: November 15, 2019, 4:20 PM IST
వైసీపీలోకి దేవినేని అవినాష్... కొడాలి నాని ఏమన్నారంటే...
జగన్, అవినాష్, కొడాలి నాని
  • Share this:
గుడివాడలో తనపై పోటీ చేసిన దేవినేని అవినాష్ వైసీపీలో చేరడంపై ఏపీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. దేవినేని అవినాష్‌ను గుడివాడలో పోటీ చేయించి.. రాజకీయ బలి పశువు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు. టీడీపీ త్వరలో ప్రతిపక్ష హోదాను కోల్పోనుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన ఇసుక దీక్షతో విసుగుచెంది టీడీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో ఇసుకను అడ్డంగా దోచుకున్నారని... తాము ఆ విధానాన్ని మార్చామని కొడాలి నాని తెలిపారు. గుడివాడ మండలం మల్లాయిపాలెంలో ఇసుక స్టాక్ పాయింట్‌ను మంత్రి ప్రారంభించారు.

గురువారం మధ్యాహ్నం దేవినేని అవివాష్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని హాజరుకాలేదు. 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్‌ గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీచేసి వైసీపీ అభ్యర్థి కొడాలి నాని చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే..ప్రస్తుతం కొడాలి నాని జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.






First published: November 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు