హోమ్ /వార్తలు /politics /

Kodali Nani on Jr.NTR: జూ.ఎన్టీఆర్ తో స్నేహంపై కుండబద్దలు కొట్టిన కొడాలి నాని.. నందమూరి కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు..

Kodali Nani on Jr.NTR: జూ.ఎన్టీఆర్ తో స్నేహంపై కుండబద్దలు కొట్టిన కొడాలి నాని.. నందమూరి కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు..

కొడాలి నాని, ఎన్టీఆర్ (ఫైల్)

కొడాలి నాని, ఎన్టీఆర్ (ఫైల్)

జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) , నందమూరి కుటుంబంపై (Nandamuri Family) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) , నందమూరి కుటుంబంపై (Nandamuri Family) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబంపై తనకే కాదు ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుందని ఆయన అన్నారు. సీఎం జగన్ (CM YS Jagan) కు కూడా నందమూరి కుటుంబం అంటే గౌరవముందన్నారు. కానీ నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబు మాటలు నమ్మి ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం నాశనమైపోతుందని ఆయన కుటంబ సభ్యులనే నమ్మించిన ఘనత చంద్రబాబుదేనని నాని అన్నారు. పదవి కోసమే చంద్రబాబు తన భార్య పేరును బయటకు తీసుకొచ్చి అల్లరి చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు ఇలా చేస్తున్నారని నాని ఆరోపించారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ తనను, ఎమ్మెల్యే వల్లభనేని వంశీనీ కంట్రోల్ చేస్తున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కొడాలి నాని ఘాటుగా స్పందించారు. తాను, వంశీ జూనియర్ ఎన్టీఆర్ మాట వినాల్సిన అవసరమేంటన్నారు. తమను కంట్రోల్ చేయడానికి తామేమన్నా ఎన్టీఆర్ నిర్మాతలమా, దర్శకులమా..? అని ప్రశ్నించారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్నమాట వాస్తమేనని.. కానీ ఆ తర్వాత విభేదాలు వచ్చి విడిపోయామని కొడాలి నాని స్పష్టం చేశారు.

ఇది చదవండి: ఏపీ ప్రభుత్వంపై న్యాయవిచారణకు డిమాండ్.. అవన్నీ ప్రభుత్వ హత్యేలనన్న బాబు


తాము సీఎం వైఎస్ జగన్ కోసం పనిచేస్తున్నామని కొడాలి నాని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ చెప్పినా, చెప్పకపోయినా ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని చెప్పారు. సీఎం జగన్ జోలికి ఎవరైనా వస్తే బయటకి లాక్కొస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. తమకు ప్రభుత్వం కల్పించిన భద్రత వదిలేసి బయటకు రావడానికి సిద్ధమని.. దమ్ముంటే చంద్రబాబు బ్లాక్ క్యాట్స్ భద్రత వదిలేసి రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబాన్ని, ఎన్టీఆర్ ను వాడుకొని రాజకీయం చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ కుమార్తెను ఎవరూ ఎమీ అనకుండానే అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు.

ఇది చదవండి: గ్రామ సచివాలయ ఉద్యోగుల వింత పరిస్థితి.. పెళ్లికి ప్రొబేషన్ కు లింక్..! అదెలాగంటే..!


అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కించపరిచేలా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారన్న వార్తలపై గతంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే. ఐతే తన వ్యాఖ్యల్లో కొడాలి నాని, వల్లభేని వంశీని నేరుగా విమర్శించకుండా తాను ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నానని జూనియర్ ఎన్టీఆర్ అనడంపై టీడీపీ నేతలు మండిపడిన సంగతి తెలిసిందే. నాని, వంశీ.. జూనియర్ ఎన్టీఆర్ కంట్రోల్ లో ఉన్నారని.. వాళ్ల ముగ్గురు కలిసి ఏదో సినిమా ప్లాన్ చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని.. జూనియర్ ఎన్టీఆర్ తో తన స్నేహంపై కుండబద్దలు కొట్టారు.

First published:

Tags: Andhra Pradesh, Jr ntr, Kodali Nani, Nandamuri Family

ఉత్తమ కథలు