గన్ ఎక్కుపెట్టిన కొడాలి నాని.. గురి ఎవరి మీదో..?

పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా గుడివాడలో ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శన ఓపెన్ హౌస్‌ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు.

news18-telugu
Updated: October 18, 2019, 5:41 PM IST
గన్ ఎక్కుపెట్టిన కొడాలి నాని.. గురి ఎవరి మీదో..?
కొడాలి నాని (FIle)
  • Share this:
ఏపీ మంత్రి కొడాలి నాని సరదాగా గన్ ఎక్కుపెట్టారు. పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా గుడివాడలో ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శన ఓపెన్ హౌస్‌ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రాణాలు లెక్కచేయకుండా పోలీసులు బాధ్యతలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పగలు, రాత్రి తేడా లేకుండా పోలీసులు కష్టపడుతున్నారని చెప్పారు. పోలీసులు అంటే ప్రజలకు ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ఇలా ఓపెన్ హౌస్ నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులకు వారాంతపు సెలవును ప్రకటించారని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఓపెన్ హౌస్ లో భాగంగా ఆయుధాల ప్రదర్శనను మంత్రి తిలకించారు. ఆయుధాల పనితీరు, ఆయుధాలు వినియోగించే విధానం, తమను తాము రక్షించుకునే పద్ధతులను పోలీసులు..మంత్రికి వివరించారు.
First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading