MINISTER KODALI NANI GIVES EXPLANATION TO SHOW CAUSE NOTICE ISSUED BY STATE ELECTION COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR AND STATED THAT HE HAS NO INTENTION TO HURT SEC HERE ARE THE DETAILS PRN
SEC vs Kodali Nani: 'జనం అనుకుంటున్నదే చెప్పా..' నిమ్మగడ్డకి కొడాలి నాని వివరణ
నిమ్మగడ్డ రమేష్ కుమార్, కొడాలి నాని(ఫైల్ ఫొటో)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda ramesh kumar) ఇచ్చిన షోకాజ్ నోటీసుపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఎస్ఈసీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన ఆయన.. తాను వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ను గానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను గానీ దూషించలేదని పేర్కొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఒకటి రెండు మాటలు అని ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీరుపై ప్రజల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించానే తప్ప.. వ్యక్తగతంగా దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నాని స్పష్టం చేశారు. కావున తాను చేసిన వ్యాఖ్యలు మరోసారి పరిశీలించి షోకాజ్ నోటీసులు వెనక్కితీసుకోవాలని వివరణ లేఖలో ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.
అలాగే ఎస్ఈసీ ఇచ్చిన నోటీసులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తమవని.. వాటిని ఖండిస్తున్నట్లు నాని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై తనకు నమ్మకం ఉందని.. ముఖ్యంరా ఎన్నికల కమిషన్ అంటే గౌరవముందన్నారు. తన వ్యాఖ్యల్లోని నిజమైన భావాన్ని ఎస్ఈసీ అర్ధం చేసుకోలేదన్న మంత్రి కొడాలి నాని మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు, రేషన్ డోర్ డెలివరీపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించడానికే మీడియాతో మాట్లాడానే తప్ప ఎస్ఈసీని దూషించడానికి కాదన్నారు.
ఎన్నికల కమిషనర్ నోటీసుకు మంత్రి కొడాలి నాని వివరణ
మంత్రి ఏమన్నారంటే..!
తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని.. రాష్ట్రంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీని అడ్డుకునేందుకు ఎస్ఈసీ, చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని ఎస్ఈసీ నిమ్మగడ్డ, చంద్రబాబు కలిసి వచ్చినా అడ్డుకోలేరన్నారు. వీరంతా జగన్నాథరథ చక్రాల కింద నలిగిపోవడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పిచ్చి పెట్టిందని.. వారిని పరీక్షించి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చెర్పించి ట్రీట్ మెంట్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు
షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలన్న కొడాలి నాని విజ్ఞప్తికి ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.