Home /News /politics /

MINISTER K TARAKA RAMA RAO WRITES LETTER TO UNION MINISTERS NIRMALA SITHARAMAN AND HARDEEP SINGH PURI SU

Minister KTR: కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ.. ఆయన ఏం కోరారంటే..

కేటీఆర్(ఫైల్ ఫొటో)

కేటీఆర్(ఫైల్ ఫొటో)

Minister K Taraka Rama Rao: కేంద్ర మంత్రులకు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కే తారకరామరావు లేఖ రాశారు.

    కేంద్ర మంత్రులకు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కే తారకరామరావు లేఖ రాశారు. రాష్ట్రంలో పురపాలక శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ది పనులకు నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. జీహెచ్‌ఎంసీలో సమగ్ర సివరేజ్‌ మాస్టర్‌ప్లాన్‌ కోసం నిధులు మంజూరు చేయాలని జ్ఞప్తి చేస్తూ కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌పురి, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లకు కేటీఆర్ లేఖ రాశారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కోరారు. అలాగే వరంగల్‌లో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న మెట్రో నియో ప్రాజెక్ట్ కి నిధులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. పురపాలక శాఖ ద్వారా పట్టణాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని కోరారు.

    మున్సిపాలిటిల్లో చేపట్టిన సాలిడ్ వేస్ట్, మానవ వ్యర్ధాల ట్రీట్మెంట్ ప్లాంట్లు, బయో మైనింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించాల్సిందిగా మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఆమోదించడంతోపాటు కనీసం 20 శాతం నిధులను రానున్న కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని కోరారు.

    ఇక, కొద్ది రోజులుగా మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులకు లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఆయన కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌లకు వేర్వేరుగా లేఖలు రాసిన సంగతి తెలిసిందే. స్మృతి ఇరానీకి రాసిన లేఖలో.. తెలంగాణలో రాష్ట్రంలోని హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం నిధులతో పాటు పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టై ల్ పార్కు తోపాటు, సిరిసిల్లలో మెగా పవర్ క్లస్టర్ మంజూరు, చేనేత, జౌళి పరిశ్రమ అభివృద్ధి కోసం పలు అంశాలు తీసుకోవాల్సిన చర్యల పైన మంత్రి కేటీఆర్ ఈ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ని సుమారు రూ.1552 కోట్ల ఖర్చుతో చేపట్టిందని, ఇందులో సుమారు రూ.1100 కోట్ల మౌలిక వసతుల కల్పనకు అవసరమవుతాయని, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మెగా టెక్స్టైల్ పార్క్ పథకం ద్వారా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కి మద్దతు అందించాలని కోరారు

    ఇక, పీయూష్‌ గోయల్‌కు రాసిన లేఖలో.. రానున్న బడ్జెట్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాల్సిందిగా లేఖ ద్వారా మంత్రి విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్‌ నిమ్జ్‌కు, హైదరాబాద్‌ ఫార్మాసిటీకి ప్రత్యేక నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: KTR, Nirmala sitharaman, Telangana

    తదుపరి వార్తలు