అదే కొంపముంచింది.. కానీ ఈసారి హుజూర్‌నగర్‌లో గెలుపు మాదే : జగదీశ్ రెడ్డి

Huzurnagar By-election : ఏదేమైనా ఈసారి హుజూర్‌నగర్‌లో గెలుపు మాత్రం టీఆర్ఎస్‌దే అని ధీమా వ్యక్తం చేశారు.హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో తాము దాడులకు పాల్పడ్డామన్న ప్రచారంలో నిజం లేదన్నారు.

news18-telugu
Updated: September 23, 2019, 12:58 PM IST
అదే కొంపముంచింది.. కానీ ఈసారి హుజూర్‌నగర్‌లో గెలుపు మాదే : జగదీశ్ రెడ్డి
మంత్రి జగదీష్ రెడ్డి (షైల్ ఫోటో)
  • Share this:
హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ఎన్నికల సంఘం నుంచి ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు.. కానీ అప్పుడే పార్టీల మధ్య మాటల యుద్దం మొదలైపోయింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఈసారి గెలుపు మాదే అని టీఆర్ఎస్ కూడా ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి హుజూర్ నగర్ ఉపఎన్నికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గత ఎన్నికల్లో తమ అభ్యర్థి స్వల్ప తేడాతో ఓడిపోయారని.. అది కూడా ట్రక్కు గుర్తు వల్లే డ్యామేజ్ జరిగిందని అన్నారు. ట్రక్కు గుర్తు వల్ల కొంత అయోమయం ఏర్పడి కొంతమంది కారుకు వేయాల్సిన ఓటు ట్రక్కు గుర్తుకు వేశారన్నారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక బరిలో ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నది సీఎం కేసీఆరే నిర్ణయిస్తారని చెప్పారు. ఏదేమైనా ఈసారి హుజూర్‌నగర్‌లో గెలుపు మాత్రం టీఆర్ఎస్‌దే అని ధీమా వ్యక్తం చేశారు.హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో తాము దాడులకు పాల్పడ్డామన్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఇప్పటివరకు తమపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు.
First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading