Home /News /politics /

MINISTER JAGADESH REDDY FIRED OVER THE PURCHASE OF GRAIN ON BANDI SANJAY VB

TRS-BJP: మొన్న ఏం జరిగిందో చూశావ్ కదా.. ఇంకా సోయి రాలేదా.. మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

మంత్రి జగదీశ్ రెడ్డి (ఫైల్)

మంత్రి జగదీశ్ రెడ్డి (ఫైల్)

TRS-BJP: బీజేపీ నేత బండి సంజయ్ పై మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ఆడుతున్న నాటకాన్ని కట్టి పెట్టాలంటూ ఆయనకు మంత్రి జగదీష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నాటు పెట్టాలా వద్దా అన్నది ఫిబ్రవరిలో కాదు ఇప్పుడే తేల్చిచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి ...
  బీజేపీ నేత బండి సంజయ్ పై మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ఆడుతున్న నాటకాన్ని కట్టి పెట్టాలంటూ ఆయనకు మంత్రి జగదీష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నాటు పెట్టాలా వద్దా అన్నది ఫిబ్రవరిలో కాదు ఇప్పుడే తేల్చిచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయం పై బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ప్రకటనలపై మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, మెతుకు ఆనంద్, మాజీ శాసనమండలి సభ్యులు శ్రీనివాస రెడ్డి లతో కలసి తెలంగాణా భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

  Alert For Farmers: రైతులకు అలర్ట్.. వర్షాల నేపథ్యంలో అధికారుల పలు సూచనలు..


  తెలంగాణ రైతాంగాన్ని మరోసారి మోసం చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నిందంటూ ఆయన బండి పై నిప్పులు చెరిగారు. ఫార్మ్ హౌస్ కాదు ఫార్మర్ హౌస్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ముమ్మాటికీ ఫార్మరే నంటూ ఆయన చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఆరు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా అంటూ ఆయన నిలదీశారు. యావత్ భారతదేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఆరు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని అది ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత అని ఆయన పేర్కొన్నారు. దేశ రైతాంగం కేంద్రం మెడలు వంచి క్షమాపణలు చెప్పించిందని ఇటువంటి బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ మంత్రి జగదీష్ రెడ్డి బిజెపి నేత బండికి వార్నింగ్ ఇచ్చారు.

  Painfull Incident: దారుణం.. అతడు ఆ పని చేశాడని.. పందిరి గుంజ కు 18 గంటల పాటు తాళ్లతో కట్టేసి చితకబాదారు..


  పంట పండించాక మాట్లాడడం అంటే ఎలా.? అలా కుదరదని.. ఈ సమస్య పుట్టించిందే బండి సంజయ్ అని.. యాసంగిలో ఏ ధాన్యం వేయాలో తేల్చి చెప్పండి అంటూ నిప్పులు చెరిగారు. ఎవరిని మోసం చేయడానికి ఆ ప్రకటనలు చేస్తున్నారంటూ.. తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టేందుకే మీ ప్రయత్నం అంటూ ఫైర్ అయ్యారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని మీ కేంద్రమంత్రి స్పష్టం చేశారని గర్తు చేశారు. వానాకాలం మొత్తం కొనాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ అని.. మహాధర్నా ద్వారా కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగింది ఇదే అన్నారు. ఇంతకు బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తారా? లేదా..? అని ప్రశ్నించారు. రెండు నెలలుగా దీనిపైనే చర్చ నడుస్తుందన్నారు. బండి సంజయ్ కు కళ్లాలు అంటే ఎమిటో కూడా తెలియదని మండి పడ్డారు.

  Sad: వాళ్లిద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు కదా.. వాళ్లను చూసిన తర్వాత భార్యభర్తలు ఇలా ఉండొద్దని నేర్చుకుంటారు..


  తెలంగాణ రైతులను మరోసారి మోసం చేసే కుట్రలకు బండి తెర లేపుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బిజెపి నాటకాన్ని రైతులు ఎండగట్టాలని కోరారు. బండికి మతి భ్రమించిందని.. ఆయన మాటలు మతిస్థిమితం లేనివి అని విమర్శించారు. ఆయన ప్రవర్తన బాధ్యతరాహిత్యం ఉందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా? తెలంగాణా లో ఆరువేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతాం అంటే ఉరుకోబోమని.. మొన్ననే తెలంగాణ రైతాంగాం తరిమి కొట్టిందన్నారు. దేశ రైతాంగం మీ మెడలు వంచి మీతో క్షమాపణ చెప్పించిందన్నారు. దానికి గుర్తు పెట్టుకొని మసలుకో అని ఎద్దేవా చేశారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Telangana bjp, TRS leaders

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు