రంగనాయక సాగర్ నీటిని విడుదల చేసిన మంత్రి హరీశ్ రావు

ఒకనాడు ఇక్కడి రైతుల పరిస్థితి అప్పులతో ఆత్మహత్య చేసుకునే వారు.. ఇక నుంచి ఆత్మ హత్యలకు పుల్ స్టాఫ్, కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తీసేస్తాం...హరీష్ రావ్

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నీటిని విడుదల చేసారు.

  • Share this:
    సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, రసమయి బాలకిషన్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. ప్రత్యేక పూజలు చేసి నీళ్లు వదిలారు. అంతకు ముందు మల్లన సాగర్ ప్రాజెక్ట్ టన్నెల్ నాలుగవ గేట్ ఇరిగేషన్ ఈఎన్సీ హరిరామ్. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ..ఎత్తి నీళ్లు విడుదల చేసారు. ఇవాళ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల చేయడం మరుపు రాని రోజని' మంత్రి హరీశ్ రావు అన్నారు.
    ఈ రోజు కోసమే తరతరాలుగా రైతులు ఎదురు చూపులు చూశారు. ఈ రోజు ఆకల నిజమయ్యిందన్నారు. కాలువల వెంట బిరబిరా గోదారమ్మ పరిగెడుతుంటే, రైతుల కళ్లల్లో ఆనంద భాష్పాలు కారుతున్నాయి అన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్, ఇంజనీర్లకు, కార్మికులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
    ఇంత కాలం రైతులు, కరెంట్, ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేశారు.. ఇక నుంచి కరెంట్, కాలంతో నిమిత్తం లేకుండా రెండు పంటలు పండించే రోజులు వచ్చాయి అన్నారు హరీష్ రావ్.
    ఒకనాడు ఇక్కడి రైతుల పరిస్థితి అప్పులతో ఆత్మహత్య చేసుకునే వారు.. ఇక నుంచి ఆత్మ హత్యలకు పుల్ స్టాఫ్, కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తీసేస్తాం అని అన్నారు. 365 రోజుల పాటు రంగనాయక సాగరుకు నీళ్లు వస్తాయి కాబట్టి కరువుకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతున్నాం. కాలిపోయిన మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లపై రైతులు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవారు.. ఇక నుంచి రైతులు ఖచ్చితంగా రెండు పంటలు పండించుకునే శుభదినం నేడు ప్రారంభమైంది. ప్రధాన కుడి కాలువ ద్వారా 40వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 70 వేల ఎకరాలు సాగునీరు అందుతున్నది అన్నారు. ప్రాథమికంగా చెరువులు, చెక్ డ్యామ్, కుంటలు, వాగులు, వంకలు వేసవి కాలంలోనే నింపుతాం. సిద్ధిపేట వాగు కింద 28 చెక్ డ్యామ్ లు శనిగరం చెరువును కూడా పెద్ద మొత్తంలో నింపుతాం. నక్కవాగు, పెద్దవాగు కింద ఉండే చెక్ డ్యామ్ లు నింపుతాం. మైనర్, సబ్ మైనర్ కాలువల తవ్వకాలకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
    వర్షాకాలం వరకు పిల్ల కాలువలు పూర్తి చేసుకోవాలి, కాలువలు తవ్వడానికి ఇదే సరైన సమయం అని మంత్రి హరీష్ రావు అన్నారు.
    Published by:Venu Gopal
    First published: