Home /News /politics /

MINISTER HARISH RAO COMMENTS ON ETELA RAJENDAR IN HUZURABAD ELECTION CAMPAIGN AK

Harish Rao: అది నిరూపిస్తారా ? ఈటలకు మంత్రి హరీశ్ రావు సవాల్

హరీశ్ రావు, ఈటల రాజేందర్ (ఫైల్)

హరీశ్ రావు, ఈటల రాజేందర్ (ఫైల్)

Harish Rao: బీసీల బిడ్డనని చెప్పుకుని ఎస్సీ, ఎస్టీ , బీసీల భూములను ఈటల రాజేందర్ క‌బ్జా చేశారని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.

    గ్యాస్ ధ‌ర త‌గ్గాలంటే రాష్ట్రం ట్యాక్స్ త‌గ్గించుకోవాల‌ని ఈట‌ల అనడాన్ని మంత్రి హరీశ్ రావు తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్క రూపాయి ట్యాక్స్ వేయడంలేదని వ్యాఖ్యానించారు. ఉన్నది జీఎస్టీ పన్ను 5 శాతం మాత్రమేనని.. అది కూడా కేంద్రం విధించిన 47 రూపాయలు మాత్రమేనని స్పష్టం చేశారు. గ్యాస్ ధ‌ర పెరుగుద‌ల‌కు కార‌ణం 291 రూపాయ‌ల రాష్ట్ర పన్ను అని చెబుతున్న ఈట‌ల రాజేంద‌ర్ దాన్ని నిరూపిస్తారా ? అని మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. ఈ విష‌యంలో జ‌మ్మికుంట గాంధీ బొమ్మ దగ్గరైనా, హుజూరాబాద్ అంబేద్కర్ బొమ్మ దగ్గరైనా చర్చకు సిద్ధమని హ‌రీశ్‌రావు అన్నారు. త‌మ్ముడిలా చేర‌దీసి ఇంత‌వాన్ని చేసిన కేసీఆర్‌కు ఘోరీ క‌డుతానంటున్న ఈట‌ల‌కు నీతినిజాయితీ లేదని లేదని హరీశ్ రావు మండిపడ్డారు.

    బీసీల బిడ్డనని చెప్పుకుని ఎస్సీ, ఎస్టీ , బీసీల భూములను ఈటల రాజేందర్ క‌బ్జా చేశారని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వంలో ఉంటూ ప‌థ‌కాల‌ను ఈటల విమర్శించారని విమర్శించారు. బీజేపీ గెలిస్తే ఒరిగేదేం ఉండ‌ద‌ని అన్నారు. టీఆర్ఎస్ గెలిస్తే హూజూరాబాద్‌లో నిర్మాణం కావాలిసిన అన్ని ర‌కాల భ‌వ‌నాలు నిర్మించ‌డంతో పాటు, ఇండ్లు లేని పేద‌ల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తాన‌ని హ‌రీశ్‌రావు హ‌మీ ఇచ్చారు. హుజురా బాద్ నియోజ‌క‌వర్గం పెంచిక‌ల్ పేట గ్రామంలో నిర్వహించిన గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న హరీశ్ రావు.. వైద్యుల‌తో త‌న‌కు 20 ఏళ్ల ఉద్యమ అనుబంధం ఉంద‌ని అన్నారు.

    Drinking More Water: నీళ్లు మరీ ఎక్కువగా తాగుతున్నారా ?.. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం..

    Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు పరీక్ష ఇదే..!

    పోరాటాల్లో, ఉప ఎన్నిక‌ల్లో వారితో కలిసి పని చేశానని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ వ‌చ్చాక గ్రామీణ వైద్యులకు తొలి నాళ్లలో ట్రైనింగ్‌తో పాటు స‌ర్టిఫికెట్స్ ఇవ్వాలని ఆలోచించి. బడ్జెట్‌లో నిధులు కూడా పెట్టింద‌ని అన్నారు. గతంలో ఇలా ఎక్కడా జరగలేదని వ్యాఖ్యానించారు. కానీ కొద్దిమంది కోర్డుకు వెళ్లడం వల్ల అది ఆగిపోయిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇప్పుడు అది కూడా ప‌రిష్కారం అయింద‌ని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Etela rajender, Harish Rao, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు