• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MINISTER HAREESH RAO FIRES ON BJP LEADERS IN DUBBAKA NS

Dubbaka ByPoll: బీజేపీ నేతలు గుండాల్లా డబ్బులు గుంజుకుని పారిపోయారు.. తప్పు చేయకుంటే భయమెందుకు.. హరీష్ రావు ధ్వజం

Dubbaka ByPoll: బీజేపీ నేతలు గుండాల్లా డబ్బులు గుంజుకుని పారిపోయారు.. తప్పు చేయకుంటే భయమెందుకు.. హరీష్ రావు ధ్వజం

మాట్లాడుతున్న మంత్రి హరీష్ రావు(ఫైల్ ఫొటో)

Dubbaka ByPoll: సిద్దిపేటలో బీజేపీ నేతలు చేస్తున్న ఆందోళనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆ పార్టీ నేతలు డబ్బులనే నమ్ముకున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.

  • Share this:
    సిద్దిపేటలో బీజేపీ నేతలు చేస్తున్న ఆందోళనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆ పార్టీ నేతలు డబ్బులనే నమ్ముకున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇటీవల హైదరాబాద్ సమీపంలో బీజేపీ నేతల వద్ద డబ్బులు దొరికిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సిద్దిపేటలోనూ పోలీసులు రైడ్ చేస్తే పోలీసుల చేతులో నుంచి బీజేపీ నేతలు డబ్బులు గుంజుకుని పారిపోయారని ఆరోపించారు. తప్పు చేయకుంటే సహకరించాలని కానీ ఇలా చేయడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఇంట్లో సైతం పోలీసులు సోదాలు నిర్వహించారన్నారు.

    తన కారు, టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత కారును సైతం చెక్ చేశారన్నారు. ఓడిపోతున్న ఫస్ట్రేషన్లోనే బీజేపీ నేతలు గొడవ చేస్తున్నారని విమర్శించారు. తాము గెలవబోతున్నామని.. ఈ సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు తమ వైపు ఉన్నారని హరీష్ అన్నారు. కరీంనగర్ నుంచి జనాలను తెచ్చుకుని బీజేపీ నేతలు నామినేషన్ వేసుకున్నారంటూ ఎద్దేవా చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు