తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు భారీ షాక్ తగలనుందా అంటే మాటే వినిపిస్తోంది. ఇందుకు కరీంనగర్లో కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలే కారణంగా తెలుస్తోంది. గత నాలుగు రోజులుగా జిల్లాలోనే మకాం వేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ అసంతృప్త నేతలతో ఓ గెస్ట్ హౌస్‌లో రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు నెలకొనడంతో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వైపు పయనమైనట్లు వార్తలు వస్తున్నాయి.. ఇటీవల దుబ్బాక ఎన్నికల్లో తో పాటు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ విజయ పరంపర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తన సొంత జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అసంతృప్త నేతలు కొందరు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.
వారిలో 20 సంవత్సరాలనుండి నుంచి మంత్రి గంగులకు కుడి భుజంగా ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ తో పాటు మరికొందరు టీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు సమాచారం. అయితే రమేష్ గతంలో కార్పొరేటర్ గా డిప్యూటీ మేయర్ గా అనేక పర్యాయాలు ప్రజల మన్ననలు పొంది కౌన్సిలర్ కార్పోరేటర్ గా ఎదిగి మంత్రి కి ఎన్నో రోజులుగా ప్రధాన అనుచరుడిగా పేరు పొందాడు. కానీ గత కొన్ని రోజులుగా మంత్రి గంగుల కమలాకర్ తనను పట్టించుకోవడం లేదని రమేష్ అసంతృప్తితో ఉన్నాడు. తనను దూరం పెట్టి ఇతరులకు ప్రధాన్యత ఇవ్వడంతో అలిగిన రమేష్ తన సన్నిహితులతో సమావేశం ఏర్పాటు చేసుకుని అనంతరం టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకునాడని తెలిసింది
ఈ వార్త మంత్రి గంగులకు తెలియడంతో రమేష్ ను పిలిపించి మాట్లాడినట్టుగా చెబుతున్నారు. అయిన గుగ్గిళ్ల రమేష్ తను టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లి పోతున్నట్టు మంత్రికి తేల్చిచెప్పారు. అయితే టిఆర్ఎస్ పార్టీలో నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా కార్యకర్తలను కట్టడి చేసేందుకు మంత్రి కార్యకర్తలతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు మొదలు కావడంతో అధికార పార్టీ నేతలు కలవర పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బండి సంజయ్ ఢిల్లీ టూర్లో ఉన్నట్లు సమాచారం. ఆయన వచ్చాక కరీంనగర్ రాజకీయం ఏ మల్పులు తీసుకుంటుందో వేచి చూడాలి.
Published by:Sumanth Kanukula
First published:December 14, 2020, 12:03 IST