అదనపు టీఎంసీ ల తరలింపు పనులు వేగంగా పూర్తి చేయాలి...మంత్రి ఈటెల రాజేందర్

అదనపు టీఎంసీ ల తరలింపు పనులు వేగంగా పూర్తి చేయాలి

సీఎం ఆదేశాల మేరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మొదటి లింకులో అదనపు టీఎంసీ తరలింపు పనులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాష్ట్ర ఉన్నతాధికారుల బృందంతో కలిసి గురువారం పరిశీలించారు

  • Share this:
    కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా అదనపు టీఎంసీ తరలించే విధంగా నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంబంధిత ఏజెన్సీలను, అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మొదటి లింకులో అదనపు టీఎంసీ తరలింపు పనులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాష్ట్ర ఉన్నతాధికారుల బృందంతో కలిసి గురువారం పరిశీలించారు, మంత్రి అధ్యక్షతన ఉన్నతాధికారుల బృందం మేడిగడ్డ(లక్ష్మి) పంప్ హౌస్ ను, అన్నారం (సరస్వతి) పంప్ హౌస్ లో మూడవ టీఎంసీ పనులను పరిశీలించిన అనంతరం గోలివాడ (పార్వతి) పంప్ హౌస్ కు చేరుకున్న బృందానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్వాగతం పలికారు. గోలివాడ పంప్ హౌస్ లో మూడవ టీఎంసీ తరలింపు నిర్మాణ పనులను పరిశీలించి అక్కడ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గతంలో సాగునీటి ప్రాజెక్టులు ఏళ్ల తరబడి నిర్మించేవారని, దేశంలో నూతన రాష్ట్రంలో రికార్డు సమయంలో భారీ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి లింకులో మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి వరకు ప్రతిరోజు 3 టీఎంసీలు ఎత్తి పోసే విధంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 3వ టీఎంసీ తరలింపునకు అవసరమైన పంపులు, మోటార్లు విదేశాల నుంచి తెచ్చుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ అవలంభించాలని, నీటి ఎత్తిపోతలకు సంబంధించిన మేధావులను సంప్రదించాలని మంత్రి అధికారులకు సూచించారు జూన్ మొదటి వారంలో మొదటి లింకులు అవసరమైన పంపులు మోటార్లు వస్తాయని, వాటి ఫిట్టింగ్ కమిషనింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. జూన్ 15 వరకు 2 పంపులు, జులై 15 వరకు మిగిలిన 4 పంపుల ఫిట్టింగ్ కమిషనింగ్ పూర్తవుతుందని అధికారులు వివరించారు. ప్రస్తుత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ మాస ప్రారంభంలో ప్రవాహం మొదలయ్యే అవకాశం ఉందని , అప్పటివరకు వీలైనంత త్వరగా పనిపూర్తి చేసి ఎత్తిపోతలకు సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు..
    Published by:Venu Gopal
    First published: