TSRTC STRIKE: ఆర్టీసీ ఇప్పట్లో కోలుకోదు... తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీలో 50 శాతం ప్రైవేటీకరణ చేస్తే సమస్యను బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: November 4, 2019, 1:58 PM IST
TSRTC STRIKE: ఆర్టీసీ ఇప్పట్లో కోలుకోదు... తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ ఆర్టీసీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఎర్రబెల్లి... ఆర్టీసీ కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని కామెంట్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు తమ ప్రభుత్వం వ్యతిరేకంగా కాదని ఎర్రబెల్లి అన్నారు. యూనియన్లపై మాత్రమే ప్రభుత్వం సీరియస్‌గా ఉందని స్పష్టం చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆర్టీసీ, టీచర్స్ నుంచి కొంత వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే అని ఎర్రబెల్లి అన్నారు. ఆర్టీసీ సమ్మె పై ప్రభుత్వం నిర్ణయాలు ప్రకటిస్తుందని... తాను వ్యక్తిగతంగా స్పందించడానికి ఏమీ లేదని అన్నారు.

50 శాతం ప్రైవేటీకరణ చేస్తే సమస్యను బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికలపై ఒక్కటి రెండు చోట్ల మినహాయిస్తే అంతటా టీఆర్ఎస్‌కే మొగ్గు ఉందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. వరంగల్‌లో మున్సిపల్ ఎన్నికలు వన్ సైడ్ ఉంటుందని... 9 మున్సిపాలిటీలు తమ సొంతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: November 4, 2019, 1:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading