సభలో రోశయ్య మాటలు... నవ్వులే నవ్వులు

తనను ప్రతిపక్ష చంద్రబాబునాయుడు పదే పదే తెలివైన వ్యక్తి అని అంటున్నారని వ్యాఖ్యానించిన మంత్రి బుగ్గన... గతంలో ఆయన రోశయ్యను కూడా ఇలాగే అన్నారని గుర్తు చేశారు.

news18-telugu
Updated: December 10, 2019, 3:37 PM IST
సభలో రోశయ్య మాటలు... నవ్వులే నవ్వులు
ఏపీ మాజీ సీఎం రోశయ్య(ఫైల్ ఫోటో)
  • Share this:
హాట్ హాట్‌గా సాగుతున్న ఏపీ అసెంబ్లీలో అప్పుడప్పుడు నవ్వులు పువ్వులు పూస్తున్నాయి. అధికార, విపక్ష సభ్యుల సెటైర్లతో కొన్నిసార్లు సభ అంతా నవ్వుల్లో మునిగి తేలుతోంది. మంగళవారం సభలో ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేసే క్రమంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఏపీ మాజీ సీఎం రోశయ్యను గుర్తు చేశారు. తనను ప్రతిపక్ష చంద్రబాబునాయుడు పదే పదే తెలివైన వ్యక్తి అని అంటున్నారని వ్యాఖ్యానించిన మంత్రి బుగ్గన... గతంలో ఆయన రోశయ్యను కూడా ఇలాగే అన్నారని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలకు అప్పట్లో రోశయ్య ఎలా కౌంటర్ ఇచ్చారో చెప్పి సభలో నవ్వులు పూయించడంతో పాటు చంద్రబాబు, టీడీపీకి ఫన్నీ కౌంటర్ ఇచ్చారు.

Chandrababu naidu, rosaiah, ysrcp, buggana rajendranath reddy, tdp, ap news, ap politics, చంద్రబాబునాయుడు, రోశయ్య, వైసీపీ, బుగ్గన, టీడీపీ, ఏపీ న్యూస్
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (ఫైల్ ఫోటో)


గతంలో రోశయ్య ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఆయనకు తెలివి ఎక్కువైందని అన్నారు. ఇందుకు కౌంటర్ ఇచ్చిన రోశయ్య... తనకు తెలివి ఉంటే ఇలా గుమాస్తా పని చేయనని... తనను నమ్మిన ముఖ్యమంత్రులను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిని అయ్యేవాడినని చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు.First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>