ఆయన సీఎంలా ఫీల్ అవుతున్నారు.. మంత్రిపై పవన్ ఫైర్

అమరావతి విషయంలో మాట్లాడిన బొత్స సత్యనారాయణ కాపు రిజర్వేషన్ల అంశంలో కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ కోరారు.

news18-telugu
Updated: September 6, 2019, 8:14 PM IST
ఆయన సీఎంలా ఫీల్ అవుతున్నారు.. మంత్రిపై పవన్ ఫైర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
news18-telugu
Updated: September 6, 2019, 8:14 PM IST
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ తనను తాను ముఖ్యమంత్రిలా ఫీల్ వుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మీద బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అటు రాజకీయ పార్టీలతో పాటు, అమరావతికి భూములిచ్చిన రైతుల్లో కూడా ఆందోళనను రేకెత్తించాయి. అమరావతి రైతులు ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కూడా కలసి తమ సమస్యలను విన్నవించారు. జనసేనాని కూడా అమరావతిలో పర్యటించారు. ప్రభుత్వం తీరు మీద విమర్శలు గుప్పించారు. అయితే, పవన్ కళ్యాణ్ రాజధాని విషయంలో గతంలో ఓ మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. తానెప్పుడూ అమరావతిని మార్చాలని చెప్పలేదన్నారు. అక్కడ గ్రీన్ క్యాపిటల్ కట్టాలని మాత్రమే తాము చెప్పామన్నారు. అమరావతి విషయంలో మాట్లాడిన బొత్స సత్యనారాయణ కాపు రిజర్వేషన్ల అంశంలో కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ కోరారు. ఏపీకి అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు అవుతుంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని అర్థమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...