పవన్‌ కళ్యాణ్‌లో ఆ లక్షణాలు లేవు... ఏపీ మంత్రి సెటైర్

పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

news18-telugu
Updated: November 13, 2019, 4:42 PM IST
పవన్‌ కళ్యాణ్‌లో ఆ లక్షణాలు లేవు... ఏపీ మంత్రి సెటైర్
పవన్ కల్యాణ్
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్‌పై పవన్ శాపనార్ధాలు సరికాదని ఆయన అన్నారు. పవన్ ఆక్రోశం దేనికోసమో అర్థంకావడం లేదని అన్నారు. రాజకీయ నాయకుడి లక్షణాలు పవన్ కళ్యాణ్‌కు లేవని విమర్శించారు. నీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి.. సామాన్యుల పిల్లలు చదవకూడదా..? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. తాము ఊరుకున్న కొద్దీ పవన్ కళ్యాణ్ రోజు రోజుకి దారుణంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పవన్ మాటల్లో అహంకారం కనిపిస్తుందని... ఏమి చూసుకుని అంత అహంకారమని అన్నారు.

ఇంగ్లీష్ లేక మన పిల్లలు అనేక ఇబ్బంది పడుతున్నారని... ఇంగ్లీష్‌పై పట్టు లేకపోవడంతో నేను కూడా ఇబ్బంది పడుతున్నానని బొత్స అన్నారు. ఇసుక మాఫియా పేరుతో టీడీపీ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌లో ఇష్టం వచ్చినట్లు రాశారని బొత్స విమర్శించారు. మా జిల్లాలో ఇసుక మాఫియా జరిగిందని నిరూపిస్తే దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు.

చంద్రబాబు కొంగ జపాలు ప్రజలకు తెలుసని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. ఐదేళ్లు ఇసుక మాఫియాను ప్రోత్సహించి దొంగ దీక్షలు చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు అంత మంచి పాలన అందిస్తే 23 సీట్లే ఎందుకు వస్తాయని బొత్స ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసం చంద్రబాబు రోజు ఏదొకటి చేస్తుంటాడని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయని బొత్స విమర్శించారు. .



First published: November 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు