మహానాడు చర్చలో పాల్గొంటాం... చంద్రబాబుకు మంత్రి బొత్స ఛాలెంజ్

దేశంలో ఏ రాష్ట్రాల్లో అమలు కానన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్నారని మంత్రి బొత్స తెలిపారు.

news18-telugu
Updated: May 23, 2020, 7:27 PM IST
మహానాడు చర్చలో పాల్గొంటాం... చంద్రబాబుకు మంత్రి బొత్స ఛాలెంజ్
బొత్స సత్యనారాయణ, చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
వైసీపీ ప్రభుత్వం ఎక్కడ వైపల్యం చెందిందో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఏపీ మంత్రి బొత్స డిమాండ్‌ చేశారు. మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను చర్చించే సమయంలో తమను కూడా జూమ్‌లోకి తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో జూమ్‌ యాప్‌లో చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రి బొత్స సవాల్‌ విసిరారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడతారని బొత్స విమర్శించారు.

దేశంలో ఏ రాష్ట్రాల్లో అమలు కానన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. న్యాయ స్థానాలకు వెళ్లి టీడీపీ ప్రజా సంక్షేమాన్ని అడ్డుకుంటుందని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. టీడీపీ వైఖరిని ప్రజలంతా గమనించాలని... కుట్రలు కుతంత్రాలతో టీడీపీ కోర్టులకు వెళ్తుందని మండిపడ్డారు.పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని బొత్స ధ్వజమెత్తారు. విజయనగరంలోని మూడు లాంతర్ల స్తూపం చారిత్రాత్మక స్తూపం కాదని.. మూడు లాంతర్ల అనేది సిమెంట్ కట్టడమని అన్నారు. మూడు లాంతర్ల సూప్తం స్థానంలో కొత్తది నిర్మాణం చేస్తున్నామని వివరణ ఇచ్చారు.

First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading