ఏపీ శాసన మండలి రద్దుపై బొత్స సంచలన కామెంట్స్...

ఏపీ అసెంబ్లీలో శాసన మండలిని రద్దు చేయాలనే అంశంపై చర్చ జరుగుతోందని మంత్రి బొత్స సంచలన కామెంట్స్ చేశారు.

news18-telugu
Updated: January 23, 2020, 2:04 PM IST
ఏపీ శాసన మండలి రద్దుపై బొత్స సంచలన కామెంట్స్...
ఎన్నికలు జరిగి 16 నెలలు మాత్రమే అవుతోందని... 16 నెలలు క్రితం ప్రజలు ఇచ్చిందే అసలైన తీర్పు అని ఆయన వ్యాఖ్యానించారు.
  • Share this:
ఏపీ అసెంబ్లీలో శాసన మండలిని రద్దు చేసే అంశంపై చర్చ జరుగుతోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మండలి ఛైర్మన్ విచక్షణాధికారాల్ని ఉపయోగించడానికి ఇది సరైన సందర్భం కాదన్న ఆయన... ఛైర్మన్... అభివృద్ధి వికేంద్రీకరణ, CRDA ఉపసంహరణ బిల్లుల విషయంలో విచక్షణాధికారాల్ని వినియోగించి... నిబంధనల్ని తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. అసలు ఇలాంటి మండలి వ్యవస్థ ఉండాలా అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోందన్న బొత్స... తొత్తుల్ని, తాబేదార్లనూ ఉన్నత పదవుల్లో ఎలా కూర్చోబెడతారంటూ మండిపడ్డారు. నిబంధనలు పాటించాలని సభలో సగం మంది చెప్పినా ఛైర్మన్ పాటించలేదని ఫైర్ అయ్యారు. తప్పు చేశానని స్వయంగా ఛైర్మనే చెప్పారన్న బొత్స... ఇలాంటి అంశంపై చర్చ జరగాలన్నారు.

మంత్రి బొత్స వ్యాఖ్యల్ని చూస్తే... కచ్చితంగా మండలిని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే... ఇది అంత తేలికైన ప్రక్రియేమీ కాదు. మండలిని రద్దు చేయాలంటే... ముందుగా... దీనిపై రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం పొందాలి. అసెంబ్లీలో వైసీపీకే మెజార్టీ ఉంది కాబట్టి అది తేలికే కావచ్చు గానీ... ఆ బిల్లును పార్లమెంట్‌కి పంపిస్తే... అక్కడ ఉభయ సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోద ముద్ర వెయ్యాల్సి ఉంటుంది. ఇదంతా జరిగేందుకు కనీసం నెల నుంచీ 3 నెలలకు పైనే పట్టే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా బొత్స వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
Published by: Krishna Kumar N
First published: January 23, 2020, 1:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading