అందుకే వైసీపీలో చేరానన్న ఏపీ మంత్రి.. జగన్‌ది గొప్ప మనసంటూ ప్రశంస

ఏపీ అసెంబ్లీ వేదికగా మంత్రి అవంతి శ్రీనివాస్ తాను టీడీపీని వీడిన కారణాన్ని బయటపెట్టారు. కాంగ్రెస్‌తో టీడీపీ కలవడం ఇష్టం లేకే తాను పార్టీని వీడి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరానన్నారు. సీఎం జగన్ సమాజంలో అన్ని వర్గాలకు తన కేబినెట్‌లో చోటు కల్పించడం హర్షించదగిన విషయమన్నారు. ఫిరాయింపుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.

news18-telugu
Updated: June 18, 2019, 10:58 AM IST
అందుకే వైసీపీలో చేరానన్న ఏపీ మంత్రి.. జగన్‌ది గొప్ప మనసంటూ ప్రశంస
అవంతి శ్రీనివాస్ (File)
news18-telugu
Updated: June 18, 2019, 10:58 AM IST
(సయ్యద్ అహ్మద్-న్యూస్18, అమరావతి కరస్పాండెంట్)

గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేందుకు ఏపీ అసెంబ్లీ ఇవాళ సమావేశమైంది. ఇందులో ముందుగా మాట్లాడిన మంత్రి అవంతి శ్రీనివాస్ తాను టీడీపీకి ఎందుకు గుడ్ బై చెప్పాల్సి వచ్చిందో కారణాన్ని బయటపెట్టారు. కాంగ్రెస్‌తో టీడీపీ కలవడం తనకు నచ్చలేదన్నారు. అందుకే తాను టీడీపీని వీడి వైసీపీలోకి చేరినట్లు అవంతి వెల్లడించారు. వైసీపీలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని సీఎం జగన్ అనతికాలంలోనే నిరూపించారన్నారు. జగన్ తన కేబినెట్‌లో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయడాన్ని అవంతి ప్రశంసించారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా జగన్ అందరికీ న్యాయం చేశారన్నారు.

పనిలో పనిగా మాజీ సీఎం, తన మాజీ బాస్ కూడా అయిన చంద్రబాబుపై అవంతి విమర్శలు ఎక్కుపెట్టారు. ఫిరాయింపుల విషయంలో సీఎం జగన్ తీసుకున్న వైఖరిని మంత్రి అవంతి ప్రశంసించారు. జగన్‌ది గొప్ప మనసంటూ పొగడ్తలతో ముంచెత్తారు. జగన్ స్ధానంలో చంద్రబాబు ఉండి ఉండే ఫిరాయింపులను నిస్సంకోచంగా ప్రోత్సహించేవారని మండిపడ్డారు. తద్వారా గతంలో ఫిరాయింపులకు పాల్పడిన అనుభవం చంద్రబాబుకు ఉందని అవంతి దెప్పిపొడిచారు. దీనిపై విపక్ష నేత స్ధానంలో ఉన్న చంద్రబాబు ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు.

ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ వైసీపీ నేతలు గత ప్రభుత్వంలో రెండేళ్ల పాటు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఫిరాయింపులపై జనంలోకి వెళ్లి తేల్చుకుంటామని చెప్పిన వైసీపీ.. అన్నట్లుగానే జనంలోకి ఈ వ్యవహారాన్ని బలంగా తీసుకెళ్లి అనుకున్న ఫలితాన్ని రాబట్టుకుంది. వైసీపీ అధికారం చేపట్టగానే తాను ఫిరాయింపులను ప్రోత్సహించబోనని స్వయంగా సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగానే చెప్పుకున్నారు. తమ పార్టీలోకి రావాలనుకునే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని స్పష్టత కూడా ఇచ్చారు.

First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...