ఏపీ శాసన మండలిలో బుధవారం ఉదయం నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఆర్డీఏ రద్దు, ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై అధికార విపక్షాలు తమ వాదనను నెగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకానొక సమయంలో పరస్పరం దాడులు చేసేకునే వరకు వెళ్లిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో వైసీపీపై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశారు. నారా లోకేష్‌పై మంత్రి అనిల్ కుమార్ దాడికి యత్నించారని ఆరోపించారు. అంతేకాదు శాసన మండలి ఛైర్మన్‌పైనా దాడి చేసేందుకు ప్రయత్నించాని విమర్శించారు. వైసీపీ సభ్యుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు యనమల. అమరావతి ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొనే బిల్లులను తాము వ్యతిరేకించామని ఆయన స్పష్టం చేశారు. మూడు రాజధానులను అందరూ వ్యతిరేకిస్తుంటే.. బిల్లులను పాస్ చేయించుకొని ఎలా వెళ్తారని ధ్వజమెత్తారు అనిల్.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.