మరో జన్మంటూ ఉంటే... ఏపీ మంత్రి ఎమోషన్

నెల్లూరు జిల్లాలో జరిగిన సభలో ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యారు.

news18-telugu
Updated: October 15, 2019, 3:26 PM IST
మరో జన్మంటూ ఉంటే... ఏపీ మంత్రి ఎమోషన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కార్యక్రమంలో అనిల్ కుమార్... సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఇరిగేషన్ మంత్రిగా తనను నియమించడం సీఎం జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని ఆయన కొనియాడారు. ఒక సైనికుడిగా జీవితాంతం సీఎం జగన్ దగ్గర పని చేస్తానని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. వచ్చే జన్మంటూ ఉంటే ఒక అనుచరుడిగా వైఎస్ జగన్ దగ్గర ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు.

ఒక బీసీ ఎమ్మెల్యేని సీఎం జగన్ మంత్రిని చేసి కీలక బాధ్యతలు అప్పగించారని అన్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయని... ఇందుకు సీఎం జగన్ పాద మహిమే కారణమని అన్నారు. మరోవైపు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన స్టయిల్లో విమర్శలు గుప్పించారు మంత్రి అనిల్. సీఎం జగన్ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మరిపిస్తున్నారని... జగన్ పరిపాలన చూసి చంద్రబాబు ఒర్వలేకపోతున్నారని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: October 15, 2019, 3:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading