జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నాడని... చంద్రబాబుని ఫాలో అవ్వడంలో పవన్ కళ్యాణ్ హచ్ కుక్కని మించిపోయాడని మండిపడ్డారు. అందుకే ప్రజలు పవన్ నాయుడు, కళ్యాణ్ నాయుడు అంటున్నారని మంత్రి అనిల్ విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ని రాజకీయ నాయకుడు అలాలో... నటుడు అనాలో అర్ధం కావడంలేదని వ్యాఖ్యానించారు. జగన్ దమ్ము, ధైర్యం గురించి ప్రజలకు తెలుసని...పవన్ చెప్పాల్సిన అవసరం లేదని అనిల్ కుమార్ అన్నారు. పవన్ సత్తా ఏంటో మొన్న ఎన్నికల్లో తెలిసిందని ఎద్దేవా చేశారు.
జగన్‌ని పవన్ ఎలా పిలిచినా మాకు అనవసరమని... పవన్‌ని పట్టించుకునేవారు ఎవరూ లేరని ఆయన అన్నారు. ప్రజలు భారీ మెజారిటీ తో గెలిపించిన ముఖ్యమంత్రి జగన్ అని... కులాలు మతాలు లేవంటూనే.. పవన్ నిత్యం అవే మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడుతున్న నీ ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్‌కు మంత్రి అనిల్ సూచించారు. పవన్ వల్ల ఏమి కాదని.. ఎవరి తోలు, తాటలు తియ్యలేరని అన్నారు.
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్(ఫైల్ ఫోటో)
ఈశ్వరుడు నోరు ఇచ్చాడుకదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని పవన్‌కు సూచించారు. ఇలానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. 2017 లో జరిగిన ఘట ను మాపై రుద్దుతున్నాడని... అప్పుడు పవన్ నిద్రపోయాడా..? అని పవన్‌ను ప్రశ్నించారు. రేణుదేశాయ్ అడిగిన ప్రశ్నలకు ఇంత వరకు సమాధానం ఎందుకు చెప్పలేదని మంత్రి అనిల్ కుమార్ పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.