Home /News /politics /

MINISTER ANIL KUMAR SLAMS JANASENA VISAKH LONG MARCH SK

దమ్ముంటే జగన్ ముందుకు రండి.. పవన్ కళ్యాణ్‌కు మంత్రి సవాల్

పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)

కళ్యాణ్‌ది లాంగ్ మార్చ్ కాదని.. రాంగ్ మార్చ్ అని ఎద్దేవా చేశారు అనిల్ కుమార్. నదులు ఉప్పొంగడం వల్లే ఇసుక దొరకండం లేదని.. నీటితో నిండి ఉన్న నదులు పవన్‌కు కనిపించడం లేదా.. అని విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి.

    ఏపీలో ఇసుక కొరతపై దుమారం రేగుతోంది. ఇసుక కొరత భవన నిర్మాణ రంగం కుదేలయిందంటూ విపక్షాలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో విశాఖలో జనసేన చేపట్టిన లాంగ్ మార్చ్‌పై వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. టీడీపీకి జనసేన అనుబంధ పార్టీగా వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్‌ది లాంగ్ మార్చ్ కాదని.. రాంగ్ మార్చ్ అని ఎద్దేవా చేశారు అనిల్ కుమార్. నదులు ఉప్పొంగడం వల్లే ఇసుక దొరకండం లేదని.. నీటితో నిండి ఉన్న నదులు పవన్‌కు కనిపించడం లేదా.. అని విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి.


    ఇసుక పేరుతో చంద్రబాబు, పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇసుక మాఫియా ఐదేళ్లు చేసిన దారుణాలపై పవన్ ఎందుకు ప్రశ్నించలేదు..? పవన్ మార్చ్ వైజాగ్‌లో ఎందుకు కృష్ణా, గోదావరి నదుల వడ్డున చెయ్యండి. రాజకీయ ఉనికి కోసమే పవన్, చంద్రబాబు ఇసుక ధర్నాలు చేస్తున్నారు. వరదలు తగ్గుముఖం పడుతున్నాయి.. వారం రోజుల్లో రాష్ట్రంలో ఇసుక కొరత తీరబోతుంది.
    అనిల్ కుమార్, మంత్రి


    పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే నిర్మాణాత్మకమైన విమర్శలు చెయ్యాలని వైసీపీ నేతలు సూచించారు. పవన్‌కు సీఎం జగన్ ముందుకు వచ్చే ధైర్యం లేదని.. సమస్య ఉంటే సీఎం వద్దకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. కొడుకును కొంగుచాటు బిడ్డలా కాపాడుకుంటూ.. దత్తపుత్రుడు పవన్‌తో చంద్రబాబు నాయుడు లాంగ్ మార్చ్ చేయిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా సొంత రాజకీయాలు చేసుకోవాలని.. చంద్రబాబుతో దోస్తీ చేస్తే వచ్చే ఎన్నికలకు కూడా కష్టమేనని అభిప్రాయపడ్డారు.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, Anil kumar yadav, Pawan kalyan, Sand shortage, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు