రైతుపక్షపాతి సీయం కేసీఆర్‌... మ‌ంత్రి అల్లోల

రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసినందుకుగానూ మంత్రి అల్లోల‌,ఇత‌ర‌ప్రజాప్రతినిధులు సీయం కేసీఆర్‌ చిత్రపటాన్ని పాలతో అభిషేకించారు.

రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసినందుకుగానూ మంత్రి అల్లోల‌, ఇత‌ర‌ప్రజాప్రతినిధులు సీయం కేసీఆర్‌ చిత్రపటాన్ని పాలతో అభిషేకించారు.

  • Share this:
    నిర్మ‌ల్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుసంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు. రూ.25 వేలలోపు పంట రుణాలమాఫీతో రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసినందుకుగానూ మంత్రి అల్లోల‌, ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయ‌క్, రైతులు, రైతు నాయకులు, ఇత‌ర‌ప్రజాప్రతినిధులు సీయం కేసీఆర్‌ చిత్రపటాన్ని పాలతో అభిషేకించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ....రాష్ట్రంలో కరోనా వైరస్‌తో ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ, వానాకాలం సాగుకు రైతుబంధు కోసం రూ. 8,210 కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌ రైతుపక్షపాతి అని అన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ రైతులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతాంగ సంక్షేమానికి నిధులు విడుదల చేశార‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా సీఎం కేసీఆర్‌కు ఉమ్మ‌డి ఆదిలాబాద్‌ జిల్లా రైతాంగం తరఫున మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు. దివ్యా గార్డ‌న్ లో ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ కే.విజ‌య‌ల‌క్ష్మి, రైతుబంధు స‌మితి జిల్లా క‌న్వీన‌ర్ న‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, జ‌డ్పీటీసీలు, రైతులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిదులు పాల్గొన్నారు.
    Published by:Venu Gopal
    First published: